వర్మ అసలు ‘వ్యూహం’ ఓటీటీలో వస్తోంది

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. అయితే.. ఈమధ్య కాలంలో వర్మ తీసిన చిత్రాలలో ‘వ్యూహం, శపథం’కి వచ్చిన వివాదాలు అన్నీ ఇన్నీ కావు. ఎలాగో సెన్సార్ బోర్డ్ అడ్డంకులన్నీ దాటుకుని ఈ సిరీస్ లోని మొదటి భాగం ‘వ్యూహం’ థియేటర్లలోకి వచ్చింది. కానీ.. ప్రేక్షకులు ఈ సినిమాని ఏమాత్రం ఆదరించలేదు. ఇక.. రెండో భాగం ‘శపథం’ విడుదల విషయంలో కాస్త జాప్యం జరిగే అవకాశం కనిపిస్తుంది.

‘వ్యూహం, శపథం’ చిత్రాలతో పాటు.. సైమల్టేనియస్ గా అదే కథాంశంతో ‘శపథం ఆరంభం చాఫ్టర్ 1, శపథం అంతం చాప్టర్ 2’ అనే రెండు వెబ్ సిరీస్ లను తెరకెక్కించాడట రామ్ గోపాల్ వర్మ. ఈ వెబ్ సిరీస్ లలో ‘శపథం ఆరంభం’ను ఈరోజు (మార్చి 7) రాత్రి 8 గంటలకు.. ‘శపథం.. అంతం’ ను రేపు (మార్చి 8) రాత్రి 8 గంటలకు ఆంధ్ర ప్రదేశ్ లో AP ఫైబర్ నెట్ లొ OTT App ద్వారా పే పర్ వ్యూ లొ చూసుకోవటానికి అవకాశం కలిపిస్తున్నాము.. అంటూ వర్మ ప్రకటించాడు.

‘శపథం ఆరంభం చాప్టర్ 1 , శపథం అంతం చాప్టర్ 2’ రెండు వెబ్ సిరీస్ లు తీయడానికి అసలు కారణం.. ఏమీ దాచకుండా పచ్చి నిజాలు అందరికీ చూపించడమే అంటున్నాడు రామ్ గోపాల్ వర్మ

Related Posts