ఆఫ్రికా అడవుల్లో మహేష్-రాజమౌళి అడ్వంచర్స్

రాజమౌళి అంటే ఇప్పుడు కేవలం తెలుగు డైరెక్టర్ మాత్రమే కాదు. యావత్ భారతదేశంలోనూ నంబర్ వన్ డైరెక్టర్. లార్జర్ దేన్ లైఫ్ స్టోరీస్ తో.. ఆన్ స్క్రీన్ పై విజువల్ వండర్స్ క్రియేట్ చేసే దర్శకుడిగా రాజమౌళికి పేరుంది. అందుకే.. రాజమౌళి తీసే సినిమా బడ్జెట్ కూడా ఆ రేంజులోనే ఉంటుంది. ‘బాహుబలి 1’ కోసం రూ.180 కోట్లు ఖర్చుపెట్టించిన జక్కన్న.. రెండో పార్ట్ ‘బాహుబలి2’ కోసం రూ.250 కోట్లు బడ్జెట్ పెట్టించాడు. ఇక.. క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ బడ్జెట్ అక్షరాలా రూ.400 కోట్లు.

ఇప్పుడు మహేష్ బాబు మూవీని మరింత లావిష్ గా తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటివరకూ తన సినిమాలకోసం పాన్ ఇండియా అప్పీల్ తో స్టోరీస్ రెడీ చేసిన జక్కన్న.. ఈసారి పాన్ వరల్డ్ స్టోరీతో మహేష్ మూవీని డిజైన్ చేస్తున్నాడు. ఆద్యంతం ఆఫ్రికా అడవుల నేపథ్యంలో ఓ అడ్వంచరస్ థ్రిల్లర్ గా మహేష్ మూవీని తెరకెక్కించబోతున్నాడట.

దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కి విజయేంద్రప్రసాద్, రాజమౌళి పెద్ద అభిమానులట. అందుకే.. విల్బర్ స్మిత్ రాసిన పలు నవలల ప్రేరణతో రాజమౌళి సినిమాకోసం స్క్రిప్ట్ సిద్ధం చేశాడట స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్. కథ పరంగా ఓ కొలిక్కి వచ్చేసిన ఈ మూవీకి.. మరో స్టార్ రైటర్ సాయిమాధవ్ బుర్రా మాటలు సమకూరుస్తున్నాడు. మొత్తంమీద.. రాజమౌళి తన మార్క్ టేకింగ్ తో ఆఫ్రికా అడవుల్లో జంతువుల మధ్య మహేష్ బాబు తో చేయించే ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు తెరపై చూడాల్సిందే.

Related Posts