స్టార్ డబ్బింగ్ రైటర్ శ్రీరామకృష్ణ కన్నుమూత

తమిళం నుంచి తెలుగులోకి అనువాదమైన మణిరత్నం, శంకర్ చిత్రాలకు దాదాపుగా అనువాద రచయితగా వ్యవహరించిన శ్రీరామకృష్ణ (74) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీరామకృష్ణ ఆరోగ్య క్షీణించటంతో చెన్నై తేనాపేటలోని అపోలో హాస్పిటల్ లో కన్నుమూశారు. శ్రీరామకృష్ణ స్వస్తలం తెనాలి. అయితే.. 50 ఏళ్ల కిందట చెన్నైలో స్థిరపడ్డారు. ఆయనకు బార్య స్వాతి, కుమారుడు గౌతమ్ ఉన్నారు. ‘జెంటిల్మన్, చంద్రముఖి’ వంటి 300 చిత్రాలకు పైగా అనువాద రచయితగా పనిచేచేశారు శ్రీ రామకృష్ణ. ‘బాలమురళీ ఎంఏ, సమాజంలో స్త్రీ’ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. రజనీకాంత్ ‘దర్బార్’ చిత్రానికి చివరిగా మాటలు అందించారు శ్రీరామకృష్ణ.

Related Posts