ఫైనల్ గా మహేష్ బాబును మెప్పించాడు

కొన్ని కాంబినేషన్స్ కోసం ఆడియన్స్ ఈగర్ గా చూస్తారు. దానికంటే ముందు ఆ కాంబో కూడా అనుకుంటుంది. తమ కలయికలో ఎంత త్వరగా ఓ సినిమా సెట్ అయితే అంత బావుంటుందని. ఈ విషయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చివరికి అనుకున్నది సాధించాడు.

అర్జున్ రెడ్డి టైమ్ లో ఆ సినిమా చూసిన వెంటనే అప్రిసియేట్ చేసిన ఫస్ట్ టాప్ హీరో మహేష్ బాబు. సందీప్ ను తన ఇంటికి పిలిపించుకుని మరీ అభినందించాడు. అంతే కాదు.. తనకూ ఓ కథ రెడీ చేయమన్నాడు. అప్పటికప్పుడే సందీప్ ఓ లైన్ చెప్పాడు. కానీ సెట్ కాలేదు.

ఈ లోగా అతనికి బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి రీమేక్ చేసే ఛాన్స్ రావడంతో అటు వెళ్లాడు. అయినా అప్పుడప్పుడూ మహేష్ కు ఏదో ఒక లైన్ చెబుతూనే వస్తున్నాడట. బాలీవుడ్లోనూ అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ గా బ్లాక్ బస్టర్ అయింది. దీంతో సందీప్ అక్కడే బిజీ అయ్యాడు. ప్రస్తుతం రణ్ బీర్ సింగ్ తో చేసిన యానిమల్ డిసెంబర్ లో విడుదల కాబోతోంది. తర్వాత ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేయాల్సి ఉంది. ఆ తర్వాత మహేష్ తో ప్రాజెక్ట్ సెట్ అయింది.


ఇటు మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ తో గుంటూరు కారం మూవీ చేస్తున్నాడు. ఇది సంక్రాంతికి విడుదల కాబోతోంది. గుంటూరు కారం తర్వాత మోస్ట్ అవెయిటెడ్ కాంబోగా చెప్పుకుంటోన్న రాజమౌళితో సినిమా స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ గురించి ఇప్పటికే రచయిత విజయేంద్ర ప్రసాద్ చాలా హింట్స్ ఇచ్చాడు. అమెజాన్ అడవుల్లో సాగే ఇంటెన్ష్ యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పాడు. ఇక ఇలాంటి కథలను రాజమౌళి ఏ రేంజ్ లో తెరకెక్కిస్తాడో ఊహించుకోవచ్చు. రాజమౌళి మూవీ తర్వాత సందీప్ రెడ్డి డైరెక్షన్ లో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు మహేష్ బాబు.


సందీప్, మహేష్ కాంబోలో వచ్చే సినిమా క్రైమ్ బ్యాక్ డ్రాప్ లో సాగే థ్రిల్లర్ సినిమా అంటున్నారు. రీసెంట్ గా ఈ కథను మహేష్ కు నెరేట్ చేశాడట. ఇప్పటి వరకూ చెప్పిన కథలకంటే ఇది చాలా బెటర్ గా ఉండటంతో మరింత డెవలప్ చేయమని చెప్పడమే కాక ఈ ప్రాజెక్ట్ కు ఓకే చెప్పాడు. సో.. మహేష రాజమౌళి మూవీతో ప్యాన్ ఇండియన్ ఇమేజ్ వస్తే.. దాన్ని రాజమౌళి సెంటిమెంట్ ను తప్పించి మరో స్థాయికి తీసుకువెళ్లే పెద్ద బాధ్యత సందీప్ పై పడిందన్నమాట.

Related Posts