త్రిషకు మరో క్రేజీ ఆఫర్

ఎవర్ గ్రీన్ గాడ్జియస్ త్రిష దూకుడు నాన్ స్టాప్ గా సాగుతోంది. ఈ వయసులో కూడా టాప్ స్టార్స్ ‘సరసన’ ఆఫర్స్ కొట్టేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తన తరం హీరోయిన్లంతా ఇప్పటికే సైడ్ అయ్యారు. లేదంటే ఇతర పాత్రల వైపు మళ్లారు. తనుమాత్రం ఇంకా మెయిన్ హీరోయిన్ గా రాణిస్తూ ఆకట్టుకుంటోంది.

తన ఖాతాలో ఇప్పుడు నాలుగు తమిళ్, రెండు మళయాల సినిమాలున్నాయంటే ఆశ్చర్య కలగక మానదు. వీటిలో మూడు సినిమాల్లో తనే మెయిన లీడ్. ఇక తమిళ్ టాప్ స్టార్స్ అయిన అజిత్ తో లియో చేసింది. ఇది అక్టోబర్ 19న విడుదల కాబోతోంది. తర్వాత అజిత్ కుమార్ తో ఓ సినిమాకు సైన్ చేసి ఉంది. మళయాలంలో రామ్ పార్ట్ 1 అనే చిత్రంలో మోహన్ లాల్ తో నటించబోతోంది. మిగతావి తనే మెయిన్ లీడ్.


లేటెస్ట్ గా త్రిషకు మరో క్రేజీ ఆఫర్ వచ్చింది. అది కూడా కమల్ హాసన్ సరసన.. మణిరత్నం దర్శకత్వంలో. రీసెంట్ గా మణిరత్నం డైరెక్ట్ చేసిన పొన్నియన్ సెల్వన్ లో త్రిషకు అద్భుతమైన పాత్ర ఇచ్చాడు మణి. అతనే మరోసారి ఆమెకు ఈ సినిమా ఆఫర్ చేశాడు. మరి ఇద్దరు లెజెండ్స్ కలిసి చేస్తోన్న సినిమాలో అవకాశం వస్తే వదులుకుంటుందా. వెంటనే ఎస్ అనేసింది. కమల్ తో కూడా త్రిష ఇంతకు ముందు చీకటి రాజ్యం అనే సినిమా చేసింది. ఈ మూవీలో తను ఆయనకు జోడీ కాదు. సినిమా కూడా పోయింది.


ఇక మణిరత్నం, కమల్ హాసన్ కాంబోలో 35యేళ్ల తర్వాత వస్తోన్న సినిమా ఇది. ఉదయనిధి స్టాలిన్ నిర్మించబోతోన్న ఈ చిత్రానికి ఏఆర రెహ్మాన్ సంగీతం చేయబోతున్నాడు. కమల్ తో పాటు మణిరత్నం సంయుక్తంగా నిర్మించబోతున్నారు. మొత్తంగా కమల్ హాసన్ – మణిరత్నం అనే ఈ క్రేజీ కాంబినేషన్ లో ఆఫర్ కొట్టేసి తన రేంజ్ ను మరింత పెంచుకుంటోంది త్రిష.

Related Posts