పవన్ కళ్యాణ్ దారెటు

ఆన్ స్క్రీన్ ఆల్రెడీ పవర్ స్టార్.. ఆఫ్ స్క్రీన్.. పవర్ కోసం పోరాడుతున్న స్టార్. బట్ ఈ రెండిటిపై కాలు వేస్తూ సాగిస్తోన్న ప్రయాణంలో సమిధలవుతున్నది నిర్మాతలు. రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేయకూడదా అంటే భేషూగ్గా చేసుకోవచ్చు. బట్ ఏది ఇంపార్టెంట్ అని తేల్చుకోవాల్సిన తరుణం వచ్చినప్పుడు తేల్చుకోవాలి. లేదంటే రెంటికి చెడ్డ రేవడి అవుతుంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు పడవలపై కాళ్లు వేస్తున్నాడు. దీంతో ఏదీ సరిగా సాగడం లేదు అనే కామెంట్స్ అటు జనసేన నుంచి ఇటు సినిమా పరిశ్రమ నుంచీ ఉన్నాయి. ఈ మధ్యే ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను ప్లాన్ చేసుకున్నాడు. ఒక్కరోజు షూటింగ్ కాగానే చంద్రబాబు అరెస్ట్ తో అటు వెళ్లాడు. అక్కడికి పోలీస్ లు అనుమతించలేదు. దీంతో రోడ్ పై ధర్నా చేశాడు. తిరిగి మళ్లీ షూటింగ్ కు వచ్చాడు.

కానీ ఈ ఒక్క రోజులో జరిగే డిస్ట్రబెన్స్ గురించి ఎవరు పట్టించుకుంటారు..? లేదూ రేపు మరో సంఘటన జరగొచ్చు. అప్పుడూ వెళతాడు కదా.. పైగా వచ్చేది ఎన్నికల టైమ్. ఈ టైమ్ లో ఎక్కువ టైమ్ సినిమాలకు కేటాయిస్తే పొలిటికల్ గా మరోసారి పరాభవం తప్పదు. పోనీ సినిమాలను ఆపేస్తే.. తనకు డబ్బులు కావాలి. ఈ రెండిటినీ బ్యాలన్స్ చేయాలంటే రాష్ట్రంలో ఏ సంచలన విషయాలూ జరగకూడదు. ఇది ఎవరి చేతిలోనూ లేదు. అలాగని ఏదైనా జరిగినప్పుడు షూటింగ్ వదిలి పవన్ కళ్యాణ్ వెళ్లిపోతే ఆపే దమ్ము ఎవరికి ఉంటుంది. ఉండదు. కానీ ఆ మేరకు డబ్బు నష్టం ఎవరికి ..?

నిర్మాతలకి. ఇవాళా రేపూ ఒకటీ రెండు హిట్స్ ఉన్నవాళ్లే నాలుగైదు సినిమాలకు అడ్వాన్స్ లు తీసుకుంటున్నారు. అన్నీ ఒకేసారి కావు కదా.. అందువల్ల పవన్ కళ్యాణ్ కూడా ముందు ఎన్నికలపై కాన్ సెంట్రేట్ చేస్తూ.. ఈ సినిమాలకు గ్యాప్ ఇస్తే బెటర్. లేదంటే ముందు ఇప్పుడు జరుగుతున్న రెండు సినిమాలనూ చకచకా పూర్తి చేసి కొత్త ప్రాజెక్ట్స్ ను హోల్డ్ లో పెడితే అప్పుడు ఉంటుంది అసలు ఆట. ఆ ఆట ఎన్ని రోజులు ఆడినా ఎవరికీ ఫరక్ పడదు. లేకపోతే ఈ నష్టాలు కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పటికే హరిహర వీరమల్లు కోసం వేసిన సెట్స్ అన్నీ ఎప్పుడో పాడైపోయాయి. కొత్తవి వేస్తారా అంటే ముందు ఈయన వస్తాడా అనేదే పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం ఆయన చెప్పడు. సదరు నిర్మాతల ఎదురుచూపులూ ఆగవు.

Related Posts