సైలెంట్ గా షూటింగ్ మొదలుపెట్టుకున్న ‘మ్యాడ్-2’

సితార ఎంటర్ టైన్ మెంట్స్ నుంచి చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించింది ‘మ్యాడ్’. ఓ ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ చుట్టూ తిరిగే కథగా కళ్యాణ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమాలో నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ హీరోలుగా నటించారు. ఇంకా.. శ్రీగౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్ కుమార్, గోపికా ఉద్యన్ హీరోయిన్లుగా చేశారు.

‘మ్యాడ్’ మూవీ హిట్టవ్వడంతో ఈ సిరీస్ లో సెకండ్ పార్ట్ ను తీసుకురాబోతుంది సితార ఎంటర్ టైన్ మెంట్స్. ఈ చిత్రానికి ‘మ్యాడ్ 2, మ్యాడ్ మ్యాక్స్’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఇక.. మొదటి భాగం అంతా కాలేజ్ చుట్టూ తిరిగితే.. సీక్వెల్ లో స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత జాబ్స్ గురించి ఆసక్తికరంగా చూపించనున్నాడట డైరెక్టర్ కళ్యాణ్ శంకర్.

ఎలాంటి ప్రకటన లేకుండానే ‘మ్యాడ్ 2’ని సైలెంట్ గా మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ‘గుంటూరు కారం’ హౌజ్ సెట్ లో గత రెండు రోజులుగా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట. ఈ ఇయర్ ఎండింగ్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.

Related Posts