అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొడుతోన్న ఎన్టీఆర్

‘దేవర’ కోసం పూర్తిగా రగ్గడ్ లుక్ లో కనిపించనున్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. బాలీవుడ్ మల్టీస్టారర్ ‘వార్ 2’ కోసం అల్ట్రా స్టైలిష్ లుక్ లో అదరగొట్టబోతున్నాడు. హృతిక్ రోషన్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో క్రేజీ మల్టీస్టారర్ గా రూపొందుతోన్న ‘వార్ 2’ కోసం ఇటీవలే ముంబై వెళ్లాడు తారక్. ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ కి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడట డైరెక్టర్ అయన్ ముఖర్జీ.

ఇక.. ఈ మూవీ షూటింగ్ టైమ్ లో ఎన్టీఆర్ తో కలిసి హీరోయిన్ ఊర్వశి రౌతేలా తీసుకున్న సెల్ఫీ బయటకు వచ్చింది. ఊర్వశి తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఈ ఫోటోలో ఎన్టీఆర్ సూపర్ స్టైలిష్ గా అదరగొడుతున్నాడు. ఇప్పటివరకూ తారక్ ని చూడనవంటి స్టైలిష్ అవతార్ లో కనువిందు చేస్తున్నాడు.

ప్రస్తుతం ‘వార్ 2’ షెడ్యూల్ లో హృతిక్-ఎన్టీఆర్ మధ్య ఓ డ్యాన్స్ సీక్వెన్స్ కూడా చిత్రీకరిస్తున్నారట. ఇండియాలోనే మోస్ట్ టాలెంటెడ్ డ్యాన్సర్స్ లో మొదటి వరుసలో నిలిచే హీరోలు హృతిక్-ఎన్టీఆర్.మరి.. వీరిద్దరూ కలిసి ఆన్ స్క్రీన్ పై డ్యాన్సులు వేస్తే.. చూడడానికి రెండు కళ్లూ సరిపోవు. ఈ సినిమాలో రా ఏజెంట్ గా ఎన్టీఆర్ కనిపించనున్నాడు. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘వార్ 2’ వచ్చే యేడాది ఆగస్టు 14న విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts