మరోసారి వెండితెరపై అలరించబోతున్న ‘జెర్సీ’

నేచురల్ స్టార్ నాని కెరీర్ లో మైల్ స్టోన్ మూవీస్ గా చెప్పుకోదగ్గ చిత్రాల్లో ‘జెర్సీ’ ఒకటి. వెండితెరపై తనదైన సహజసిద్ధమైన నటనతో అదరగొట్టే నాని.. ‘జెర్సీ’ మూవీలో అర్జున్ పాత్రలో జీవించాడని చెప్పొచ్చు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో ఇండియన్ క్రికెట్ టీమ్ కి ఆడాలనుకునే అర్జున్.. అనివార్య కారణాలతో ఆటకు దూరమవ్వడం.. భార్య ప్రేమకు నోచుకోకపోవడం.. మళ్లీ కొడుకు కోసం క్రికెట్ ను మొదలుపెట్టడం వంటి అంశాలు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యాయి. దీంతో ఈ చిత్రం అద్భుతమైన విజయాన్ని సాధించింది.

ఏప్రిల్ 19, 2019న విడుదలైన ‘జెర్సీ’ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించింది. ఈ సినిమాకి అనిరుధ్ సంగీతం మరో అదనపు ఆకర్షణ. ‘జెర్సీ’ చిత్రం విడుదలై ఐదేళ్లవుతోన్న నేపథ్యంలో ఈ సినిమాని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది సితార సంస్థ. ఏప్రిల్ 20న ‘జెర్సీ’ రీ-రిలీజవుతోంది.

Related Posts