‘లవ్ మీ’ టీజర్.. దెయ్యంతో రొమాన్స్ చేయాలనుకునే హీరో

దిల్ రాజు కాంపౌండ్ అంటేనే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ ను ఎక్స్ పెక్ట్ చేస్తాం. అలాగే.. దిల్ రాజు సంస్థ నుంచి ఫక్తు ప్రేమకథా చిత్రాలు కూడా ఎన్నో వచ్చాయి. కానీ.. ఈసారి కాస్త వైవిధ్యంగా ఓ దెయ్యంతో ప్రేమలో పడటం అనే సరికొత్త కాన్సెప్ట్ తో దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి రాబోతున్న సినిమా ‘లవ్ మీ’. ‘ఇఫ్ యూ డేర్’ అనేది ఈ మూవీకి ట్యాగ్ లైన్.

‘రౌడీ బాయ్స్’ ఫేమ్ ఆశిష్ రెడ్డి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ‘బేబి’ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తుంది. లెజెండరీ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. ఎమ్.ఎమ్.కీరవాణి ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తుండగా.. పి.సి. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ సమకూరుస్తున్నాడు. ఇప్పటికే టైటిల్ మోషన్ పోస్టర్ తో ఆకట్టుకున్న ‘లవ్ మీ’ మూవీ నుంచి టీజర్ రిలీజయ్యింది.

‘భయమేసే చోట రొమాన్స్..ఇంకా ఎగ్జైటింగ్ గా ఉంటుంది ప్రియా.. ‘ అంటూ అశిష్ చెప్పే డైలాగ్ తో ప్రారంభమైన ఈ టీజర్ ఆసక్తికరంగా ఉంది. దెయ్యంతో రొమాన్స్ చేయాలనే కోరికతో ఓ పాడుబడ్డ బిల్డింగ్ లోకి వెళ్లే హీరో.. అతన్ని వారించే హీరోయిన్.. మధ్యలో దెయ్యం చేసే హడావుడితో టీజర్ అయితే ఇంట్రస్టింగ్ గా ఉంది. ముందునుంచీ ఈ మూవీలో వైష్ణవి దెయ్యం పాత్రలో కనిపిస్తుందనేది ప్రచారమైంది. కానీ.. ఆమె హీరో పక్కన ఉండడం ఈ టీజర్ లో చూడొచ్చు. మరి.. దెయ్యం పాత్రను ఎవరు పోషించారు? అది కూడా వైష్ణవియే చేసిందా? అనేది తెలియాలంటే సినిమా వచ్చే వరకూ ఆగాల్సిందే.

దిల్ రాజు ప్రొడక్షన్స్ హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, నాగ మల్లిడి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకుడు. త్వరలోనే ‘లవ్ మీ’ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయనుంది టీమ్

Related Posts