లండన్ లో దీన్ తననా అంటున్నాడు శ్రీనివాస్. ఈ శ్రీనివాస్ ఎవరంటే పవర్‌స్టార్ , సాయిధరమ్ తేజ్ మూవీ ‘బ్రో’ లో సాయితేజ్ తమ్ముడు గా నటించాడు. ఆ సినిమా ద్వారా నటుడిగా మంచి మార్కులు కూడా కొట్టేశాడు. ఇప్పుడు స్టార్ ప్రొడక్షన్స్, ఏబి ఇంటర్‌నేషనల్ ఫిలింస్, అనిక ప్రొడక్షన్‌లు సంయుక్తంగా నిర్మాణంలో హుస్సేన్ డైరెక్షన్‌లో ‘దీన్‌తననా’ అనే సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా లండన్‌లో గ్రాండ్ గా ఓపెనింగ్ కార్యక్రమం జరుపుకుంది.
మెయిన్‌లీడ్ శ్రీనివాస్, నటుడు, కమెడియన్ ఆలీ పై మొదటి షాట్ ను చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌లో పదిరోజుల పాటు షూటింగ్ చేసుకుని ఇండియాకి తిరిగి వచ్చేస్తామని దర్శకుడు హుస్సేన్ తెలిపారు. త్వరలోనే మిగిలిన నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను తెలియచేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.