‘కన్నప్ప‘ కోసం లెజెండరీ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా

మంచు విష్ణు ప్రతిష్ఠాత్మకంగా మొదలుపెట్టిన మెగా ప్రాజెక్ట్ ‘కన్నప్ప‘ గురించి రోజుకో కొత్త వార్త తెలుస్తూనే ఉంది. ఇటీవలే న్యూజిలాండ్ లో ఈ చిత్రం రెండో షెడ్యూల్ మొదలుపెట్టుకుంది. ‘కన్నప్ప‘ కోసం ఇప్పటికే చాలామంది స్టార్స్ రంగంలోకి దిగుతున్నారు. ఓ బిగ్ మల్టీస్టారర్ గా ఈ సినిమా రూపొందుతోంది. కాస్టింగ్ విషయంలోనే కాదు.. టెక్నీషియన్స్ పరంగానూ ‘కన్నప్ప‘ ప్రత్యేకంగా నిలవబోతుంది.

‘కన్నప్ప‘ సినిమాలోని పాటలకు లెజెండరీ ప్రభుదేవా కొరియోగ్రాఫ్ చేయబోతున్నాడు. ఈ మేరకు ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ప్రభుదేవాకు ‘కన్నప్ప‘ టీమ్ గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. న్యూజిలాండ్‌ లోని అందమైన ప్రదేశాల్లో ఈ సినిమాను షూట్ చేస్తున్నారు. ఈ చిత్రంలో విష్ణు టైటిల్ రోల్ లో కనిపించబోతుండగా.. మోహన్ బాబు, మోహన్ లాల్, ప్రభాస్ వంటి మహామహులెంతో మంది నటిస్తున్నారు. ‘మహాభారతం‘ సీరియల్‌ ను తీసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి హాలీవుడ్ సినిమాటోగ్రఫర్ షెల్డన్ చౌ పని చేస్తున్నారు.

Related Posts