‘గామి‘ నుంచి పవర్ ఫుల్ ‘శివమ్‘ గీతం

ఈవారం థియేటర్లలోకి వస్తోన్న చిత్రాల్లో విశ్వక్ సేన్ ‘గామి‘ ఒకటి. విశ్వక్ అఘోరాగా విభిన్నతరహా పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాలో చాందిని చౌదరి మరో కీలక పాత్ర పోషించింది. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా నరేష్ కుమరన్ సంగీతంలో శ్రీమణి రాసిన ‘నీలోని యుద్ధం శివమ్.. నీతోని యుద్ధం శివమ్.. నీకై నీ యుద్ధం శివమ్..‘ అంటూ సాగే పవర్ ఫుల్ సాంగ్ రిలీజయ్యింది. ‘శివమ్.. ది స్పిరిట్ ఆఫ్ గామి‘ అంటూ సాగే ఈ గీతాన్ని తన మెస్మరైజింగ్ వాయిస్ తో శంకర్ మహదేవన్ ఆలపించాడు. ఈ పాట విజువల్ గా కూడా ఆకట్టుకోబోతుందని లిరికల్ సాంగ్ చూస్తే అర్థమవుతుంది.

Related Posts