‘లంబసింగి’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

భరత్‌ రాజ్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ… ‘బిగ్ బాస్’ ఫేమ్ దివి కథానాయికగా కాన్సెప్ట్ ఫిల్మ్స్ పతాకంపై ఆనంద్.టి నిర్మిస్తున్న సినిమా ‘లంబసింగి’.ఆంధ్రాలో సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేషన్ ఒకటి ఉంది. ఆంధ్రా కశ్మీర్‌గా పాపులర్ అయ్యింది. అదే ‘లంబసింగి’.


ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చిత్ర నిర్మాణంలో ‘లంబసింగి’ చిత్రం రూపొందుతోంది. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను దర్శకులు హరీష్ శంకర్ విడుదల చేశారు.
ఈ సినిమా పాటలు “నచ్చేసిందే… డోలారే… వయ్యారి గోదారి పాటలకు అద్భుతమైన స్పందన లభించింది.
కళ్యాణ్ కృష్ణ సినిమా చేస్తున్నాడు అంటే నా సొంత సినిమాల అనిపించింది. ట్రైలర్ బాగుంది, అందమైన లొకేషన్స్ లో సినిమాను చిత్రీకరించిన విధానం బాగుంది. దర్శకుడు నవీన్ గాంధీ ఒక అందమైన ప్రేమకథను లంబసింగి సినిమా ద్వారా చెప్పబోతున్నారు. మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న లంబసింగి సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్న అన్నారు ప్రముఖ దర్శకులు హరీష్ శంకర్

Related Posts