HomeMoviesటాలీవుడ్'సత్యం' దర్శకుడు సూర్యకిరణ్ ఇకలేరు!

‘సత్యం’ దర్శకుడు సూర్యకిరణ్ ఇకలేరు!

-

తెలుగులో ‘సత్యం’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు సూర్యకిరణ్‌ కన్ను మూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. మాస్టర్‌ సురేష్‌ పేరుతో 200లకు పైగా చిత్రాల్లో బాలనటుడిగా, సహాయ నటుడిగా నటించిన ఆయన తెలుగులో ‘సత్యం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యారు. అప్పటి నుంచి ఆయన పేరు సూర్యకిరణ్‌గా మార్చుకున్నారు.

సత్యం’ తర్వాత ‘ధన 51, బ్రహ్మాస్త్రం, రాజు భాయ్‌, చాప్టర్‌-6’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు సూర్య కిరణ్. అయితే.. ‘సత్యం’ తర్వాత మళ్లీ అలాంటి విజయం దక్కలేదు. ‘బిగ్‌బాస్’ ‌సీజన్‌-4లోనూ కంటెస్టెంట్‌గా పోటీపడ్డారు సూర్య కిరణ్. కథానాయిక కల్యాణిని ప్రేమ వివాహం చేసుకుని.. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో విడిపోయారు. బాల నటిగా పలు చిత్రాల్లో నటించి.. ఆ తర్వాత సీరియల్స్ లో బాగా పేరు తెచ్చుకున్న సుజిత.. సూర్యకిరణ్ సోదరి.

ఇవీ చదవండి

English News