Mahanati : కీర్తి సురేష్ చేతినిండా సినిమాలే

ఒకప్పుడు టాలీవుడ్ లోనే కాక కోలీవుడ్ లో కూడా నెంబన్ వన్ హీరోయిన్ అవుతుందీ అనుకున్నారు కీర్తి సురేష్‌. కానీ తను ఎంచుకున్న కథల వల్ల టాప్ హీరోయిన్ కాలేదు కానీ.. బెస్ట్ హీరోయిన్ గా మాత్రం పేరు తెచ్చుకుంది

. అయితే తను చేసిన కొన్ని సినిమాలతో ఇక హీరోయిన్ గా ఎక్కువ కాలం రాణించలేదు అనుకున్నారు. మరోవైపు తెలుగులో శ్రీ లీల జోరు చూశాక ఇక టాప్ ప్లేస్ తనదే అనుకున్నారు. బట్ కీర్తి చేతిలో ఉన్న సినిమాలు చూస్తే శ్రీ లీల జోరు ఈమెపై ఏ మాత్రం పనిచేయలేదు అని చెప్పొచ్చు.

మరి తన చేతిలో అన్ని సినిమాలున్నాయి ఇప్పుడు. కాకపోతే అన్నీ తెలుగులోనే లేవు. తెలుగతో పాటు తమిళ్, మళయాలంలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో తను తమిళ్ లో చేస్తోన్న మూవీస్ మాత్రం వెరీ ఇంట్రెస్టింగ్ గా కాంబినేషన్స్ లో ఉన్నాయి.


ఉదయనిధి స్టాలిన్ తో ఓ సోషల్ కాజ్ తో రూపొందిన సినిమా మామన్నన్ అంచనాలు పెంచుతోంది. మారి సెల్వరాజ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సీనియర్ కమెడియన్ వడివేలు ఓ సీరియస్ పాత్ర చేయడం విశేషం. మరి ఈ మూవీ తెలుగులోనూ విడుదలవుతుందా లేదా అనేది ఇంకా తేలలేదు.

రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ గా కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ అందుకున్న జయం రవితో సైరన్ అనే సినిమాలో నటిస్తోంది. దీంతో పాటు తనే టైటిల్ రోల్ చేస్తోన్న రివాల్వర్ రీటా లైన్ లో ఉంది. ఇదో వైవిధ్యమైన డ్రామాగా రూపొందుతోంది. ఇక కేజీఎఫ్, కాంతార చిత్రాలు నిర్మించిన హొంబలే పిక్చర్స్ బ్యానర్ లో రఘు తాత అనే చిత్రం చేస్తోంది.ఇది కూడా పూర్తి వైవిధ్యమైన చిత్రమే.


వీటి తర్వాత ఆకాశం నీ హద్దురా ఫేమ్ సుధా కొంగర డైరెక్షన్ లో రూపొందే చిత్రంలో కూడా తనే హీరోయిన్. ఇందులో మరోసారి సూర్యతో జత కట్టే అవకాశం ఉందంటున్నారు. ఇలా మొత్తంగా తన చేతిలో అరడజనుకుపైగా చిత్రాలున్నాయి. ఈ మధ్యే కాస్త గ్లామర్ డోస్ కూడా పెంచిన కీర్తి సురేష్‌ .. ఆ డోస్ ను వెండితెరపై కూడా చూపిస్తే ఇంక చెప్పేదేముందీ. తను కోరుకున్న టాప్ ప్లేస్ చాలా సులువుగా వచ్చేస్తుందంతే.

Related Posts