Lavanya tripathi : అందాల రాక్షసితో వరుణ్ తేజ్ పెళ్లి ఫిక్స్

కొన్ని ఎంత దాచినా దాగవు. అలాంటిదే వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల ప్రేమాయణం. ఈ ఇద్దరూ కలిసి 2017లో శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన మిస్టర్ సినిమాలో మొదటిసారిగా కలిసి నటించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఎవరికీ తెలియకుండా డేటింగ్స్ కూడా చేశారు. తర్వాత అంతరిక్షం సినిమాలో మరోసారి కలిసి నటించారు. అయితే వీరి ప్రేమ వ్యవహారం రీసెంట్ గానే బయటకు వచ్చింది.

అంటే తన చెల్లికి పెళ్లి చేస్తే తనకు లైన్ క్లియర్ అవుతుంది కాబట్టి ముందుగా నిహారిక పెళ్లి చేశాడు వరుణ్ తేజ్. ఆమె లైఫ్‌ ఆమె చూసుకుంటోందిప్పుడు. దీంత ఇక తన మ్యారేజ్ ప్రపోజల్స్ ను ఇంట్లో పెట్టాడు వరుణ్‌. బట్ ఈ పెళ్లికి మెగా ఫ్యామిలీలో అభ్యంతరాలున్నాయనే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా లావణ్యతో పెళ్లికి నాగబాబు అడ్డు చెప్పాడు అన్నారు.


ఫైనల్ గా అన్నీ క్లియర్ చేసుకుని ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోందనే వార్త టాలీవుడ్ లో బలంగా వినిపిస్తోంది. ఈ నెల 9నే ఇరుకుటుంబాల సమక్షంలో గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరగబోతోందట. అయితే ఈ ఎంగేజ్మెంట్ కు ఫ్యామిలీలోని చిరంజీవి, రామ్ చరణ్‌, పవన్ కళ్యాణ్‌ తో పాటు అల్లు అర్జున్ కూడా అవైలబుల్ గా ఉంటేనే చేద్దాం అనుకుంటున్నారట. అంటే వారి డేట్స్ ఇబ్బంది అయితే వీరి ఎంగేజ్మెంట్ డేట్ కూడా మారుతుందన్నమాట. ఇద్దరూ కలిసి డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకుంటారు అంటున్నారు.


ఇక లావణ్య పర్సనల్ లైఫ్‌ మేటర్ కు వస్తే.. ఆమెది ఉత్తరప్రదేశ్. డెహ్రాడూన్ లో పెరిగింది. అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది.

ఫస్ట్ మూవీతోనే టాలీవుడ్ లో బెస్ట్ ఇంప్రెషన్ వేసి�