ఎయిడ్స్ ఉన్న వ్యక్తి కథతో కార్తీ సినిమా

కార్తీ.. తమిళ్ వాడే అయినా తెలుగులోనూ తిరుగులేని మార్కె్ట్ క్రియేట్ చేసుకున్నాడు. అతనికి తెలుగులో కూడా చాలామంది అభిమానులున్నారు. ఒకప్పుడు తమిళ్ తో సమానంగా తెలుగులో ఓపెనింగ్స్ తెచ్చకున్నాడు.

మధ్యలో కొన్ని ఫ్లాపులతో ప్రస్తుతం కాస్త వెనకబడి ఉన్నాడు. బట్.. కార్తీ సినిమా అంటే ఖచ్చితంగా ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. కమర్షియల్ సినిమాలే కాదు..కాన్సెప్ట్ బేస్ట్ స్టోరీస్ తోనూ ఎంటర్టైన్ చేస్తాడు. అందుకే అతని సినిమాలకు సెపరేట్ ఫ్యాన్ బ్యాంక్ కూడా ఉంది.

రీసెంట్ గా సర్దార్, పొన్నియన్ సెల్వన్ రూపంలో మంచి విజయాలు అందుకున్న కార్తీ ఇప్పుడు జపాన్ అనే వెరైటీ స్టోరీతో రాబోతున్నాడు. ఆ మధ్య తన బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ మూవీ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక విశేషం ఏంటంటే.. టైటిల్ వెరైటీగా ఉన్నా.. ఇదో రియల్ లైఫ్‌ స్టోరీ అంటున్నారు. పైగా అతనో దొంగ కూడానట.


2009లో మురుగన్ అనే దొం చెన్నైలోని లలితా జ్యూయొలరీలో భారీ దొంగతనం చేశాడు. ఆరోజుల్లోనే దాని విలువ 13 కోట్లుగా చెబుతారు. అతను గోల్డ్ స్మగ్లర్ గానే బాగా ఫేమస్ అంట. అంటే తన లైఫ్ లో మాగ్జిమం దొంగతనాలన్నీ బంగారం షాపుల్లోనే చేశాడు. అయితే లలిత జ్యాయొలరీ కేస్ లో తర్వాత పోలీస్ లకు దొరికిపోయాడు. కోర్ట్ లో శిక్ష పడింది. ఆ శిక్ష అనుభవిస్తూ జైల్లోనే చనిపోయాడు. అతను చనిపోయే టైమ్ కు ఎయిడ్స్ వ్యాధి ఉన్నట్టుగా గుర్తించారు. అంటే అతని మరణానికి కారణం ఎయిడ్సే అనేది ప్రాథమికంగా తేల్చారు. ఇక ఈ దొంగ తను దోచుకున్న సొత్తుతో తరచూ జపాన్ కు వెళ్లి జల్సాలు చేసి వచ్చేవాడట.

అలాంటి వ్యక్తి కథతోనే ఇప్పుడు కార్తీ హీరోగా “జపాన్” అనే సినిమా వస్తుందని చెబుతున్నారు.
ఇంతకు ముందు యోగిబాబుతో “మండేలా”అనే థాట్ ప్రోవోకింగ్ మూవీ తీసిన రాజా మురుగన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే కార్తీ స్టార్ హీరో కాబట్టి ఇందులో ఎయిడ్స్ అనే పాయింట్ ఉండదు అంటున్నారు. అదే టైమ్ లో కాస్త ఎక్కువ ఫిక్షన్ ను యాడ్ చేసి సదరు జపాన్ జైలు నుంచి తప్పించుకుని వెళ్లిపోవడం అనేది క్లైమాక్స్ గా ఉంటుందట. మొత్తంగా కార్తీ కథలు బలే ఉంటాయి కదా..?

Related Posts