ఓటిటికి నాగ చైతన్య సినిమా

నాగ చైతన్య, కృతిశెట్టి జంటగా నటించిన సినిమా కస్టడీ. వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ మూవీ థియేటర్స్ లో ఫ్లాప్ గా తేలింది. రిలీజ్ కు ముందు ఈ మూవీపై భారీ అంచనాలుండేవి.

అంతకు ముందే వెంకట్ ప్రభు టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో చేసిన తమిళ్ మూవీ మానాడు బ్లాక్ బస్టర్ అయింది.వెంకట్ ప్రభు అంటే మోస్ట్ టాలెంటెడ్ అన్న పేరుంది. దీంతో ఫస్ట్ టైమ్ తెలుగులో మూవీ చేస్తున్నాడు.. అటు ప్రమోషన్స్ లో నాగ చైతన్య ఈ సినిమా గురించి బాగా ఎగ్జైటింగ్ గా చెప్పాడు అని అంచనాలు పెరిగాయి.

దీనికి తోడు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి సంగీతం అందించారు అనే ప్రచారం కూడా కలిసొచ్చింది. అరవింద్ స్వామి, ప్రియమణి అంటూ పెద్ద తారాగణమే ఉంది. ఎలా చూసినా అన్నీ పాజిటివ్ వైబ్స్ తో రిలీజ్ అయిన కస్టడీకి ఓపెనింగ్స్ వచ్చాయి కానీ.. ఆ నెక్ట్స్ షోకే తగ్గిపోయాయి. ఫస్ట్ హాఫ్‌ బావున్నా.. సెకండ్ హాఫ్‌ తేలిపోవడంతో మూవీ లవర్స్ అంతా రిజెక్ట్ చేశారు.


అలాంటి చిత్రాన్ని ఇప్పుడు ఓటిటిలో విడుదల చేస్తున్నారు. ఈ నెల 9నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ కస్టడీ స్ట్రీమ్ కాబోతోంది. మామూలుగా ఓటిటికి రావాలంటే ఒక పర్టిక్యులర్ టైమ్ వరకూ ఆగాలి అనే రూల్ ఉంది. కానీ ఈ మధ్య డిజాస్టర్ అనిపించుకున్న సినిమాలన్నీ ఆ రూల్ ను కాదని చాలా ముందుగానే ఓటిటిలో వస్తున్నాయి. ఇప్పుడు కస్టడీ కూడా ఆ లిస్ట్ లో చేరింది.

Related Posts