HomeMoviesటాలీవుడ్తమ్ముడుతో కాంతార బ్యూటీ

తమ్ముడుతో కాంతార బ్యూటీ

-

తెలుగులో కొన్నాళ్లుగా శాండల్ వుడ్ బ్యూటీస్ దే హవా. అందంతో పాటు టాలెంట్ కూడా వారి సొంతం. కాంతార సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న బ్యూటీ సప్తమి గౌడ. ఈ మూవీ క్రేజ్ తో వెంటనే ప్యాన్ ఇండియన్ మూవీ ది వాక్సిన్ వార్ లో ఆఫర్ కొట్టేసింది.

కశ్మీర్ ఫైల్స్ వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఈ నెల 28న సలార్ తో పాటుగా విడుదల కాబోతోంది. ఇక ఈ బ్యూటీని తెలుగులోనూ తీసుకోవాలని కొందరు ప్రయత్నించారు. ఫైనల్ గా నితిన్ సరసన ఆఫర్ కొట్టేసిందంటున్నారు. ఇంకా అఫీషియల్ గా ప్రకటించలేదు కానీ నితిన్ లేటెస్ట్ మూవీలో సప్తమి గౌడను హీరోయిన్ గా తీసుకున్నారుట.


నితిన్ హీరోగా రీసెంట్ గానే ప్రారంభమైన వేణు శ్రీ రామ్ మూవీలో సప్తమి గౌడనే హీరోయిన్ అంటున్నారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ మూవీ అక్కా తమ్ముడు సెంటిమెంట్ తో రూపొందుతుంది. అందుకే ఈ చిత్రానికి ‘తమ్ముడు’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

ఇది రెండు దశాబ్దాల క్రితం వచ్చిన పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ కావడంతో ఫ్యాన్స్ లోనూ ఈ మూవీపై ఒక క్రేజ్ ఏర్పడింది. వేణు శ్రీరామ్ చివరగా వకీల్ సాబ్ తో విజయం అందుకున్నాడు. ఇక నితిన్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇస్తోన్న సప్తమి గౌడకు ఇక్కడ మరీ పెద్ద క్రేజ్ లేదు. కానీ ఈ మూవీ విజయం సాధిస్తే మాత్రం క్రేజ్ తో పాటు ఆఫర్స్ కూడా వరుసగా వస్తాయి.

ఇవీ చదవండి

English News