ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదు. అయినా ఒత్తిడి తట్టుకోలేకో, కుటుంబ, వ్యక్తిగత సమస్యల వల్లో చాలామంది ఆత్మహత్యలే పరిష్కారం అనుకుంటారు. తాజాగా ఓ సినీ, సీరియల్ నటి తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

మళయాల సినిమా పరిశ్రమలో కొన్ని సినిమాలతో పాటు సీరియల్స్ లో కూడా నటిస్తోన్న అపర్ణా నాయర్ అనే నటి గురువారం రాత్రి తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

అపర్ణ నాయర్ భర్త ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. వీరి మధ్య మనస్ఫర్థలు కూడా లేవు అంటున్నారు చుట్టు పక్కల వాళ్లు. అయితే తన ఆత్మహత్య గురించి భర్త, పిల్లలు పోలీస్ లకు చెప్పకుండా శవాన్ని హాస్పిటల్ కు తరలించడంపై పోలీస్ లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆమె చావుకు కుటుంబ కలహాలే కారణమా అనే కోణంలో విచారణ చేస్తున్నారు.