సలార్ పోస్ట్ పోన్ …

ప్రభాస్ హీరోగా నటించిన సినిమా సలార్. ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంపై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. బాక్సాఫీస్ డైనోసార్ గా ప్రభాస్ ను ఈ సినిమాతో ప్రమోట్ చేస్తున్నారు. శ్రుతి హాసన్ ఫీమేల్ లీడ్ లో నటించిన సలార్ లో మళయాల స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా నటించాడు.

ఈ నెల 28న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది అనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇంకా చెబితే అధికారికంగా ప్రకటించడం మాత్రమే మిగిలి ఉందంటున్నారు. నిజానికి రిలీజ్ టైమ్ దగ్గర పడుతున్నా కొద్దీ ఇప్పటి వరకూ ఈ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ యాక్టివిటీస్ అంటూ ఏం కనిపించలేదు.అప్పుడే ఫ్యాన్స్ అప్డేట్స్ కోసం భారీగా డిమాండ్ చేశారు. వేకప్ సలార్ టీమ్ అంటూ హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో హంగామా చేశారు. అయినా మూవీ టీమ్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు.


మరోవైపు ఈ మూవీ బిజినెస్ పరంగానూ భారీ ధరలు చెబుతున్నారు. దీంతో బిజినెస్ యాంగిల్ లో కూడా డిస్ట్రిబ్యూటర్స్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు అని నిరంతరం వార్తలు వస్తూనే ఉన్నాయి. రీసెంట్ గా ఓవర్శీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ తోనే హాఫ్ మిలియన్ కలెక్ట్ అయి ఉంది. రిలీజ్ వరకూ అన్ని ఏరియాల్లో బుకింగ్స్ ఓపెన్ చేస్తే టూ మిలియన్ వరకూ అవుతుందనే అంచనాలూ ఉన్నాయి. ఇలాంటి తరుణంలో సలార్ మూవీ వాయిదా పడుతోందనే వార్తలు టాలీవుడ్ తో పాటు కంట్రీ మొత్తం షాకింగ్ గా ఉంది.


యస్.. ఈ నెల 28న విడుదల కావాల్సిన సలార్ ను డిసెంబర్ లో విడుదల చేస్తాం అని డిస్ట్రిబ్యూటర్స్ కు మేకర్స్ సమాచారం ఇచ్చారట. ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే.. సి.జి వర్క్ దర్శకుడు ఆశించినంత గొప్పగా రాలేదట. ప్రధానంగా కొన్ని సీన్స్ ను పూర్తిగా మార్చాల్సిందే అనిపించిందట. అందుకే మళ్లీ ఆ సీన్స్ ను సిజి కోసం ఇచ్చారు. ఈ కారణంగానే రిలీజ్ డేట్ వాయిదా పడింది. ఒకవేళ సిజి వర్క్ దర్శకుడికి సంతృప్తికరం అనిపిస్తే ఈ నెలలో రావొచ్చేమో కానీ.. అది సాధ్యం కాదు అని శాండల్ వుడ్ నుంచి బలంగా వినిపిస్తోంది. సో.. కొత్త డేట్ ను త్వరలోనే ప్రకటించబోతున్నారు.

Related Posts