‘కన్నప్ప’ ఫస్ట్ లుక్.. విల్లు ఎక్కుపెట్టిన విష్ణు

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. శివ భక్తుడైన కన్నప్ప జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. విష్ణు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో పలు భాషల్లో ఈ చిత్రాన్ని తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎక్కువభాగం న్యూజిలాండ్ లో చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈరోజు మహాశివరాత్రి కానుకగా ‘కన్నప్ప‘ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజయ్యింది. ఈ పోస్టర్ లో మంచు విష్ణు లుక్ ను రివీల్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్ లో విష్ణు విల్లు ఎక్కుపెట్టిన లుక్ ఆకట్టుకుంటుంది.

ఈ సినిమాలో మోహన్ బాబు, ప్రభాస్ లతో పాటు పలు భాషలకు సంబంధించిన మోహన్ లాల్, శివరాజ్ కుమార్, శరత్ కుమార్ వంటి సీనియర్ యాక్టర్స్ కీ రోల్స్ లో కనువిందు చేయబోతున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌ టైన్‌ మెంట్ బ్యానర్స్ పై ముకేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు

Related Posts