‘కంగువ’ కాన్సెప్ట్.. గతం, వర్తమానం ఢీకొన్నచోట.. కొత్త భవిష్యత్తు ప్రారంభమవుతుంది!

‘గతం మరియు వర్తమానం ఢీకొన్న చోట.. కొత్త భవిష్యత్తు ప్రారంభమవుతుంది’ అంటూ సూర్య ‘కంగువ’ నుంచి కొత్త పోస్టర్ రిలీజయ్యింది. తమిళ న్యూ ఇయర్ స్పెషల్ గా విడుదలైన ఈ మూవీ పోస్టర్ లో పాస్ట్ లో ఉన్న సూర్య.. ప్రెజెంట్ లో ఉన్న సూర్య.. ఎదురుపడినట్టు చూపించారు. ఈ పోస్టర్ తో ఈ మూవీ స్టోరీ.. పాస్ట్, ప్రెజెంట్ మిళితంతో ఉండబోతున్నట్టు చెప్పకనే చెప్పాడు డైరెక్టర్ శివ.

భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో దిశా పటానీ, బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను హ్యూజ్ బడ్జెట్ తో ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. పది భాషల్లో తెరకెక్కుతున్న ‘కంగువ’ త్రీడీలోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. పలు అంతర్జాతీయ భాషల్లోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాదే ఆడియన్స్ ముందుకు రానున్న ‘కంగువ’ విడుదల తేదీపై త్వరలో క్లారిటీ రానుంది.

ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ తో ‘కంగువ’పై అంచనాలు ఆకాశాన్నంటాయి. ఆమధ్య విడుదలైన టీజర్ లో.. ఓ ఫిక్షనల్ వరల్డ్ ను చూపించారు. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ ఘట్టాలతో టీజర్ ఆద్యంతం సరికొత్త అనుభూతిని కలిగించింది. హీరోకి మించి విలన్ అన్నట్టుగా భయంకరమైన ఆహార్యంతో సూర్య, బాబీ డియోల్ పాత్రలు టీజర్ లో ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం, నేపథ్య సంగీతం మరో ప్లస్ అవుతోందని భావిస్తోంది టీమ్.

Related Posts