మరోసారి పాట పాడిన విజయ్.. ట్రెండింగ్ లో సాంగ్

తమిళ దళపతి విజయ్ మంచి సింగర్ కూడా. ఈమధ్య తన సినిమాల్లో వరుసగా పాటలు పాడుతున్నాడు. లేటెస్ట్ గా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ కోసం మరోసారి తన గళం విప్పాడు. ఈ సినిమాలో యువన్ శంకర్ రాజా కంపోజ్ చేసిన ‘విజిల్ పోడు’ అంటూ సాగే హై ఎనర్జిటిక్ సాంగ్ ఆలపించాడు విజయ్. తమిళ న్యూ ఇయర్ స్పెషల్ గా రిలీజైన ఈ పాట విడుదలైన క్షణాల్లోనే ట్రెండింగ్ లోకి దూసుకెళ్లింది. ఈ పాటలో విజయ్ తో పాటు.. ప్రభుదేవా, ప్రశాంత్ కూడా సందడి చేస్తున్నారు.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో మోహన్, జయరామ్, స్నేహా, లైలా, అజ్మల్, మీనాక్షి చౌదరి, వైభవ్ వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎ.జి.ఎస్. ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తున్న ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ సెప్టెంబర్ లో విడుదలకు ముస్తాబవుతోంది.

Related Posts