చెర్రీతో జాన్వీ రొమాన్స్‌

జాన్వీ కపూర్‌.. అందాల రాణి శ్రీదేవి నటవారసురాలిగా అడుగుపెట్టి బాలీవుడ్‌లో బిజీ అయ్యింది. ఫోటోషూట్‌లతో, సోషల్ మీడియాలో యాక్టివ్‌ గా ఉండే జాన్వీ ఇప్పుడిప్పుడే తెలుగు నాట కూడా వరుస ఆఫర్స్‌ తో దూసుకుపోతుంది. తెలుగు సినిమాలు కూడా పాన్ ఇండియా లాంగ్వేజెస్‌లో రిలీజ్‌ కానుండటంతో జాన్వీ ఇమేజ్‌ బిటౌన్‌ మార్కెట్‌లో తెలుగు సినిమాలకు ప్లస్‌ అవుతాయనడంలో సందేహం లేదు. దేవరతో ఎన్టీఆర్‌తో కొరటాల శివ డైరెక్షన్‌లో జోడీ కడుతున్న జాన్వీ ఇప్పుడు గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌తో రొమాన్స్ చేయనుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి ఉప్పెన ఫేమ్‌ సానా బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్నారు. RC 16 వర్కింగ్‌ టైటిల్‌తో ఈ మూవీ షూటింగ్ జరుపుకోబోతుంది. మార్చి 6 న జాన్వీ కపూర్ బర్త్‌ డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌లో జాన్వీ జాయిన్‌ కాబోతుందని అఫిషియల్‌ అనౌన్స్‌మెంట్ ఇచ్చి.. బర్త్‌డే విషెస్ తెలియజేసింది RC 16 మేకర్స్‌.

Related Posts