రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా ‘జరగండి జరగండి’ పాట

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, భారీ చిత్రాల దర్శకుడు శంకర్ కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. కనీవినీ ఎరుగని ఈ క్రేజీ కాంబో సెట్టవడం.. షూటింగ్ జరుపుకోవడం.. జరుగుతూనే ఉంది. కానీ.. ‘గేమ్ ఛేంజర్’ ఎప్పుడు విడుదలవుతోంది? అనేదే మిలియన్ డాలర్స్ క్వశ్చన్ గా మిగిలింది. శంకర్ కిట్టీలో ‘ఇండియన్ 2‘ కూడా ఉండడంతో ‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ నత్తనడకన సాగుతోంది.

ఇప్పటికే మేజర్ పార్ట్ చిత్రీకరణ పూర్తిచేసుకున్న ‘గేమ్ ఛేంజర్’ వైజాగ్ లో న్యూ షెడ్యూల్ షురూ చేసుకుంది. ఈ సినిమాని ఈ ఏడాదే ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు శంకర్. ఇక ఈ మూవీ నుంచి లాంగ్ పెండింగ్ ‘జరగండి జరగండి’ పాటను ఈ నెలలో 27న రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోందట.

Related Posts