హ్యాపీ బర్త్ డే శర్వానంద్

శర్వానంద్.. ఈ పేరు వినగానే ఓ వెర్సటైల్ యాక్టర్ మన కళ్ల ముందు మెదులుతాడు. రొటీన్ కమర్షియల్ ఫార్మాట్ లో సాగకుండా.. విలక్షణమైన కథలు ఎంచుకుంటూ తనదైన ప్రత్యేక పంథాలో సాగే ఛాలెంజింగ్ హీరో కనిపిస్తాడు. ఆమధ్య వరుస ఫ్లాపులతో సతమతమైన శర్వానంద్.. ‘ఒకే ఒక జీవితం‘తో మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేశాడు. ఈరోజు (మార్చ్ 6) శర్వానంద్ బర్త్ డే.

టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లో శర్వానంద్ ఒకడు. 20 ఏళ్ల వయసులోనే చిన్న చిన్న పాత్రలతో చిత్రరంగ ప్రవేశం చేసిన శర్వానంద్.. అనతి కాలంలోనే హీరోగా.. సినీ ఇండస్ట్రీలో తన గమ్యాన్ని సెట్ చేసుకున్నాడు. పలు సినిమాల్లో పక్కింటబ్బాయి తరహా పాత్రల్లో కనిపించి.. తెలుగు వారందరికీ ఎంతో సుపరిచితమైన మోస్ట్ ఫేవరెట్ హీరోగా మారిపోయాడు.

దాదాపు రెండు దశాబ్దాల సినీ ప్రస్థానంలో శర్వానంద్ పలు వైవిధ్యభరిత పాత్రలు పోషించాడు. ‘గమ్యం, ప్రస్థానం, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఎక్స్ ప్రెస్ రాజా, రన్ రాజా రన్, శతమానం భవతి, మహానుభావుడు‘ వంటి చిత్రాలు.. శర్వానంద్ కి మంచి విజయాలందించాయి. ఇక.. ‘మహానుభావుడు‘ తర్వాత ఐదేళ్ల పాటు విజయాలకు దూరమైన శర్వానంద్ ని.. ‘ఒకే ఒక జీవితం‘ మళ్లీ ఫుల్ ఫామ్ లోకి తీసుకొచ్చింది. టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ‘ఒకే ఒక జీవితం‘ విజయాన్ని సాధించడమే కాదు.. విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది.

ప్రస్తుతం శర్వానంద్ తన కొత్త సినిమాని శ్రీరామ్ ఆదిత్య డైరెక్షన్ లో చేస్తున్నాడు. సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోన్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. శర్వా 35వ చిత్రమిది. ఈ సినిమా టైటిల్ తో పాటు.. యు. వి. క్రియేషన్స్ లో చేసే 36 చిత్రం, ఎ. కె. ఎంటర్ టైన్మెంట్స్ లో చేసే 37వ చిత్రాలకు సంబంధించి క్రేజీ అప్డేట్స్ ను తన బర్త్డే స్పెషల్ గా అందించబోతున్నాడు శర్వానంద్.
మొత్తంమీద.. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా శర్వానంద్ మరెన్నో ఉన్నతశిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ మరోసారి బర్త్ డే విషెస్ చెబుదాం.

Related Posts