ఎన్టీఆర్ దేవరపై షాకింగ్ న్యూస్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న దేవర సినిమాపై భారీ అంచనాలున్నాయి. జనతా గ్యారేజ్ తర్వాత వీరి కాంబోలో వస్తోన్న సినిమా ఇది. అయితే ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ ప్యాన్ ఇండియన్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఏ సినిమా చేసినా ఆ ఇమేజ్ కు తగ్గట్టుగానే ప్లాన్ చేసుకోవాలి. కంట్రీ మొత్తం కమర్షియల్ గా హిట్ కొట్టే కంటెంట్ ఉండేలా చూసుకోవాలి. అందుకే ఈ మూవీ కోసం చాలా టైమ్ తీసుకున్నాడు. కథ పక్కాగా కుదిరే వరకూ ఆగారు. ఈ టైమ్ లో ఎవరెన్ని కమెంట్స్ చేసినా ఎవరూ పట్టించుకోలేదు.

దీనికి ముందు కొరటాల ఆచార్య వంటి డిజాస్టర్ ఇచ్చి ఉన్నాడు. దీంతో కామెంట్ రాయుళ్లు మరింత రెచ్చిపోయారు. అయినా కొరటాల మాత్రం కామ్ గా తన పనేదో తను చేసుకుంటూ పోయాడు. ఫైనల్ గా యంగ్ టైగర్ ను మెప్పించాడు. సెట్స్ లోకి అడుగుపెట్టారు. ఈ సినిమా ప్రారంభం అయిన దగ్గర నుంచీ పూర్తిగా యాక్షన్ సీక్వెన్స్ లనే చిత్రీకరిస్తున్నారు. ఇప్పటి వరకూ టాకీ స్టార్ట్ కాలేదంటే ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఈ యాక్షన్ సీక్వెన్స్ లే సినిమాలో అత్యంత కీలకం అని ముందు నుంచీ అంటున్నారు.అయితే లేటెస్ట్ గా ఈ షాకింగ్ న్యూస్ బయటకు వస్తోంది. దీని గురించి మూవీ టీమ్ కూడా అఫీషియల్ గా త్వరలోనే చెప్పబోతోంది.


ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ డ్యూయొల్ రోల్ చేస్తున్నాడట. యస్.. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు అనేది నిజం అంటున్నారు. అది కూడా తండ్రి కొడుకులుగా నటిస్తున్నాడు. ఫాదర్ పేరే దేవర అంటున్నారు. ఓ ఫిక్షనల్ ఐలండ్ నేపథ్యంలో సాగే సినిమాలో ఆ ఐలాండ్ పోర్షన్ లోనే దేవర పాత్ర ఉంటుందట. ఇక మూవీలో మొత్తం ఎనిమిది ఫైట్లు ఉంటాయని టాక్. ఎనిమిది ఫైట్లు అంటే ఈ మధ్య కాలంలో వస్తోన్న సినిమాలను చూస్తే చాలా ఎక్కువ అనే చెప్పాలి. కానీ కథకు కనెక్ట్ అయితే ఖచ్చితంగా ఎంటర్టైన్ చేస్తాయి ఈ ఫైట్స్. పైగా ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ కు వచ్చిన ఇమేజ్ తో చూస్తే ఈ యాక్షన్ సీక్వెన్స్ లు ఆడియన్స్ యాక్సెప్ట్ చేసేలానే ఉంటాయి.


ఇక ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రంలో మరో సర్ ప్రైజింగ్ లేడీ దేవర పాత్ర సరసన ఉంటుందని టాక్. విలన్ గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. అతని పాత్ర అత్యంత క్రూరంగా ఉంటుందట. ఇంకా ప్రకాష్‌ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, మురళీ శర్మ, చైతన్య రాయ్ కీలక పాత్రల్లో నటించబోతున్నారు. మొత్తంగా ఎన్టీఆర్ డ్యూయొల్ రోల్ అంటే ఆడియన్స్ లో ఈ సారి క్రేజ్ డబుల్ అవుతుంది.


ఇంతకు ముందు యంగ్ టైగర్ ఆంధ్రావాలాలో తండ్రి కొడుకులుగా డ్యూయొల్ రోల్ చేశాడు. అదుర్స్ లో అన్న దమ్ములుగా రెండు పాత్రలు, జై లవకుశలో ముగ్గురు అన్నదమ్ములుగా నటించిన ఎక్స్ పీరియన్స్ ఉంది. అయితే ఆంధ్రావాలా టైమ్ లో అతని వయసు చాలా చిన్నది. అందుకే తండ్రి కొడుకులు అంటే ఆడియన్స్ అంగీకరించలేకపోయారు. ఇప్పుడు ఆ సిట్యుయేషన్ లేదు. సో.. దేవర సంహారంతో బాక్సాఫీస్ షేక్ అవడం ఖాయం అనుకోవచ్చు.

Related Posts