ఈసారి వరుణ్ తేజ్ ప్రయోగం ఫలిస్తోందా?

పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే నటులు అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఒకడు. ‘కంచె‘ సినిమాకోసం బ్రిటీష్ ఇండియా సోల్జర్ గా మారినా.. ‘అంతరక్షం‘ కోసం ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ తీసుకున్నా.. ‘గని‘ కోసం బాక్సర్ గా అలరించినా.. అది వరుణ్ తేజ్ కే చెల్లింది. అయితే.. ప్రయోగాలు ఈ మెగా హీరోకి అంతగా కలిసి రావడం లేదు. ఎన్నో అంచనాలతో వచ్చిన ‘అంతరక్షం, గని, గాండీవధారి అర్జున‘ వంటి విభిన్న తరహా చిత్రాలను ప్రేక్షకులు ఆదరించలేదు.

అయితే.. ఈసారి మాత్రం ప్రయోగంతో ఫలితం పొందాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు వరుణ్ తేజ్. ఆద్యంతం ఏరియల్ యాక్షన్ తో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్‘ మార్చి 1న విడుదలకు ముస్తాబవుతోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ మూవీలో ఫైటర్ పైలట్ గా కనిపించబోతున్నాడు వరుణ్ తేజ్. ఇప్పటివరకూ విడుదలైన ప్రచార చిత్రాలతో సినిమాపై బజ్ భారీగానే పెరిగింది. ఈ సినిమా హిందీలోనూ విడుదలకాబోతుండడంతో నార్త్ సర్కిల్స్ లో కూడా ఈ చిత్రంకోసం ఓ రేంజులో ప్రమోషన్స్ నిర్వహించాడు వరుణ్ తేజ్.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన పట్టణాల్లో ‘ఆపరేషన్ వాలెంటైన్’ను ప్రమోట్ చేస్తున్నాడు . రేపు (ఫిబ్రవరి 25) ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. హైదరాబాద్ జె.ఆర్.సి. కన్వెన్షన్స్ లో జరిగే ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు.

Related Posts