పుష్ప2 రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా..

స్టైలిష్‌ స్టార్ నుంచి అల్లు అర్జున్ ను ఐకన్ స్టార్ గా మార్చిన సినిమా పుష్ప. ఈ మూవీతో ప్యాన్ ఇండియన్ స్టార్ అయిపోయాడు. సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన మూడో సినిమా ఇది. ఇద్దరూ హ్యాట్రిక్ కొట్టడమే కాదు.. కంట్రీ మొత్తం షేక్ చేశారు. ఫస్ట్ టైమ్ బన్నీ డీ గ్లామర్ రోల్ చేశాడు. ఆ రేంజ్ ఇమేజ్ ఉన్న హీరో ఆ పాత్ర చేయడం సాహసమే. ఆ సాహసానికి వచ్చిన ఫలితం ప్యాన్ ఇండియన్ ఇమేజ్.

తెలుగు నుంచి ఇప్పటి వరకూ ప్యాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నవాళ్లంతా కేవలం రాజమౌళి ద్వారానే వెళ్లారు. ఫస్ట్ టైమ్ అల్లు అర్జున్ .. రాజమౌళి హెల్ప్ లేకుండానే ఆ ఇమేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ మూవీకి సీక్వెల్ తయారవుతోంది. పుష్ప ది రూట్ అనే టైటిల్ తో రూపొందుతోంది. సెకండ్ పార్ట్ కథ కోసం కాస్త ఎక్కువ టైమ్ తీసుకున్న సుకుమార్.. షూటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత గ్యాప్ తీసుకోవడం లేదు. ఇప్పటికే సినిమా 60 శాతం వరకూ పూర్తయిందని టాక్.


పుష్ప2 కూడా ఫస్ట్ పార్ట్ లాగా డిసెంబర్ లోనే విడుదలవుతుందనే వార్తలు మొదటి నుంచీ ఉన్నాయి. బట్ ఈ షూటింగ్ పార్ట్ చూస్తే డిసెంబర్ రిలీజ్ అసాధ్యం అనే చెప్పాలి. అఫ్ కోర్స్ డిసెంబర్ లో వస్తున్నాం అని మూవీ మేకర్స్ కూడా ఎప్పుడూ చెప్పలేదు. జస్ట్ జనం మాత్రమే అనుకున్న మాట అది. ఇక ఈ చిత్రానికి విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ వర్క్ చాలానే ఉంటుంది. అందుకే నవంబర్, డిసెంబర్ వరకూ షూటింగ్ పూర్తి చేసుకుని తర్వాత మూడు నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేయాలనుకుంటున్నారు.

అంటే మార్చి వరకూ ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. అందుకే సినిమాను ఏప్రిల్ లో విడుదల చేయాలనే ప్లాన్ లో ఉన్నారట. ఏప్రిల్ 5న ఎన్టీఆర్ దేవర విడుదలవుతుంది. ఆ తర్వాత ఇప్పటి వరకూ ఏ సినిమా కూడా సమ్మర్ రిలీజ్ డేట్ చెప్పలేదు. అందుకే పుష్ప సమ్మర్ హాలిడేస్ ను రూల్ చేయడానికి ఏప్రిల్ థర్డ్ వీక్ లేదా చివరి వారంలో వస్తాడని వినిపిస్తోంది. మాగ్జిమం ఇప్పుడున్న సిట్యుయేషన్ చూసినా అంతే అవుతుంది. సో.. పుష్ప 2 ఏప్రిల్ లో సమ్మర్ స్పెషల్ గానే వస్తుందని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోవచ్చు.

Related Posts