రామ్ చరణ్ కూతురికి అల్లు అర్జున్ గిఫ్ట్

రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు జూన్ 20న కూతురు జన్మించింది. కాస్త ఆలస్యంగా సంతానం అందడంతో మెగా ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ పాపకు ‘క్లీంకార’ అని నామకరణం చేశారు.

అప్పట్లోనే ఉపాసనను చూసేందుకు మెగా ఫ్యామిలీ అంతా అపోలో హాస్పిటల్ కు క్యూ కట్టింది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత చిరంజీవి ఆ పాప నామకరణ మహోత్సవాన్ని కుటుంబ సభ్యులతో కలిసి గొప్పగా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ మధ్య ఈ పాపకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ ఖరీదైన కానుకను బహూకరించాడు అనే వార్తలు వచ్చాయి. దీన్ని ఎవరూ ఖండించలేదు. నిజం అనీ చెప్పలేదు. ఇక ఇప్పుడు ఐకన్ స్టార్ అల్లు అర్జున్ కూడా క్లీంకారకు ఓ వెరైటీ గిఫ్ట్ ను ప్రెజెంట్ చేశాడు అంటున్నారు.


ఒక బంగారు పలకపై క్లీంకార పుట్టిన రోజుతో పాటు ఆమె పేరుకున్న అర్థం తెలిసేలా ఒక మంచి డిజైన్ చేయించి ఆ గోల్డ్ ప్లేట్ ను క్లీంకారకు ప్రెజెంట్ చేశారు అంటున్నారు. ఈ డిజైన్ చూసి చరణ్ దంపతులు కూడా ఆశ్చర్యపోయారట. అంత కొత్తగా ఉందని టాక్. ఏదేమైనా క్లీంకార పుట్టిన దగ్గర్నుంచీ మెగా ఫ్యామిలీలో ఓ సందడి వాతావరణం అయితే ఉంది. ఇక ఇలాంటి గిఫ్ట్ న్యూస్ బయటకు వచ్చినప్పుడల్లా ఆయా హీరోల అభిమానుల్లో కూడా ఓ ఆనందం కనిపిస్తుది.

Related Posts