సౌత్ లోని మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లో సిద్ధార్థ్ ఉంటాడని ఏ డౌట్ లేకుండా చెప్పొచ్చు. ఏం చేసినా హానెస్ట్ గా చేస్తాడు. ఒకప్పుడు లవర్ బాయ్ గా తెలుగు పరిశ్రమలో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పటికీ అతనికి ఆ క్రేజ్ ఉంది. కానీ మధ్యలో ఎక్కడో పట్టు కోల్పోయాడు. అప్పటి నుంచి మళ్లీ పట్ట సంపాదించేందుకు విక్రమార్క ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఆ మధ్య వచ్చిన మల్టీస్టారర్ మూవీ మహా సముద్రంతో భారీ డిజాస్టర్ చూసిన సిద్ధూ లేటెస్ట్ గా టక్కర్ తో వచ్చాడు.
బట్ ఈ టక్కర్ కు అతనే బలైపోయాడు అనేది నిజం. కార్తీక్ అనే తమిళ్ డైరెక్టర్ ను నమ్మి తీసిన ఈ చిత్రం ఏ దశలోనూ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఒకప్పుడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన సిద్ధార్థేనా ఈ కథను సెలెక్ట్ చేసుకుంది అనిపిస్తుంది కూడా. ఆ రేంజ్ లో బోర్ కొట్టించాడు. మామూలుగా రోడ్ జర్నీ.. నేపథ్యంలో చాలా థ్రిల్లర్ మూవీస్ ఉన్నాయి. కానీ మనకు కాస్త తక్కువ. ఆ తక్కువలోనూ బెస్ట్ అని చెప్పుకునే చిత్రాలు రెండూ తమిళ్ నుంచే ఉన్నాయి. ఒకటి ఆవారా. రెండు సిద్ధూనే నటించిన ఎన్ హెచ్ 45.ఈ రెండూ ఆకట్టుకుంటాయి. బట్ టక్కర్ లో ఆ ఫార్ములాస్ ఏవీ కనిపించవు. పైగా అక్కర్లేని ట్రాక్ లు అనేకంఉన్నాయి ఈ చిత్రంలో. దీంతో బోరోభ్యహ అనిపిస్తుంది చిత్రం.
ఫస్ట్ హాఫ్ ఎలాగోలా భరించాం.. ఇక రోడ్ పైకి చేరిన సెకండ్ హఫ్ అయినా మెప్పిస్తుందేమో అనుకుంటే.. అది ఇంకా దారుణం. ఇమేజ్ కు సరిపోతుందని రొమాన్స్ పెడితే ఎవరూ చూడరు. పైగా కథకు సంబంధం లేకుండా ఉంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. టక్కర్ లో జరిగింది అదే. హీరోయిన్ తో ఓ రేంజ్ లో స్కిన్ షో చేయించారు. అది ఏ మాత్రం వర్కవు కాకపోగా వల్గర్ గానూ కనిపిస్తుంది.
మొత్తంగా టక్కర్ మూవీ ప్రమోషన్స్ లో ఓ రేంజ్ లో మాట్లాడాడు సిద్ధార్థ్. ఈ చిత్రం తన కెరీర్ కు కొత్త బూస్టప్ ఇస్తుందన్నాడు. ఆడియన్స్ కు కొత్త అనుభూతి ఇస్తుందనీ చెప్పాడు. కొత్త అనుభూతి అనే మాట నిజమే. కానీ అది పాజిటివ్ ఫీలింగ్ కాదు అని టక్కర్ కు గురైన ఏ ప్రేక్షకుడిని అడిగినా చెబుతారు. కొన్నాళ్ల క్రితం గృహం అనే హారర్ మూవీతో ఆకట్టుకున్న సిద్ధార్థ్ ఇప్పుడు కొత్తగా వస్తోన్న చిత్రాలను స్టడీ చేయకుండా ఇలాగే ఇలాంటి కథలనే సెలెక్ట్ చేసుకుంటే ఇంక అతని కెరీర్ షెడ్ కు వెళ్లినట్టే అని చెప్పొచ్చు.
యంగ్ హీరో వరుణ్ సందేశ్ లేటెస్ట్ మూవీ 'నింద'. కాండ్రకోట మిస్టరీ అంటూ యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా…
ఇప్పటివరకూ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ తో అలరించిన నిర్మాత దిల్రాజు.. ఈసారి ఓ దెయ్యం కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.…
స్టార్ హీరోలు నటించే సినిమాల ఆడియో రైట్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. వారు నటించే సినిమాల ఆడియో రైట్స్…
Young hero Raj Tarun's latest movie is 'Purushothamudu'. Dr. Ramesh Tejawat and Prakash Tejawat are…
చిన్నారి పెళ్లికూతురుగా బుల్లితెరపై పరిచయమై.. 'ఉయ్యాల జంపాల'తో హీరోయిన్ గా సెటిలైన బ్యూటీ అవికా గోర్. మొదట్లో 'సినిమా చూపిస్తా…
కోవిడ్ తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో చెప్పుకోదగ్గ వేడుకలేవీ జరగలేదు. తారలంతా ఒకే వేదికపై కనిపించిన దాఖలాలు దాదాపు లేవనే…