పవన్ కళ్యాణ్‌ ఫోటో ఫేక్ కాదా..

పవన్ కళ్యాణ్‌ మూడో భార్యకు కూడా విడాకులు ఇవ్వబోతున్నాడు అంటూ సోషల్ మీడియాతో కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. పాలిటిక్స్ లో ఉండటం వల్ల అవి ప్రతి పక్షాలకూ అస్త్రాలుగా మారాయి. ఇప్పటికే రాజకీయాల్లో ప్రత్యర్థులకు పవన్ కళ్యాణ్‌ మూడు పెళ్లిళ్లు అనేది బలమైన పాయింట్ గా మారింది.

మాట్లాడితే ఇద అంటుంటారు. దీనికి తోడు ఇప్పుడు మూడో భార్యకు కూడా విడాకులు ఇస్తున్నాడు అనే మాట వస్తే ఇంకేముందీ.. విమర్శలకు మరింత పదునెక్కుతుంది. చట్ట బద్ధంగా ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా.. అది పవన్ కళ్యాణ్‌ వ్యక్తిగత వ్యవహారం.

కానీ సమాజం అలా అనుకోదు కదా..? జనసేన నాయకులు, కార్యకర్తలు ఈ విషయంలో పవన్ ను ఎంతో సపోర్ట్ చేస్తుంటారు. అది ఆయన వ్యక్తిగతం అంటూ చెబుతుంటారు. బట్ వైఎస్ఆర్సీపీ వాళ్లు మాత్రం ఇంకేమీ లేనట్టుగా ముఖ్యమంత్రితో సహా ఇదే పాయింట్ పై విమర్శలు చేస్తున్నారు.


దీంతో వారి విమర్శలకు చెక్ పెట్టేందుకు తాజాగా పవన్ కళ్యాణ్‌ తన మూడో భార్య అన్నా లెజినోవాతో కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేశాడు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్‌ వారాహి విజయయాత్ర మొదటి దశను విజయవంతంగా ముగించాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఇంట్లో పూజలు నిర్వహించారు. ఆ సందర్భంగానే ఈ ఫోటోస్ తీశారు అంటూ ఒక ఫోటోను విడుదల చేశారు.

దీంతో తమ విడాకులు విషయంలో వస్తోన్న విమర్శలకు చెక్ పెట్టాలని చూసినట్టు అయింది అని అంతా భావించారు. బట్ ఇది ఫేక్ అంటూ మరో కొత్త వార్త ఒకటి హల్చల్ చేస్తోంది. పవన్ కళ్యాణ్ తన మూడో భార్యతో కలిసి ఉన్నట్టుగా షేర్ చేసిన ఫోటో ఫేక్ అంటూ సోషల్ మీడియాలో మరో చర్చ మొదలైంది. ఆ ఫోటో చిరంజీవి రెండో కూతురు శ్రీజ రెండో పెళ్లి సందర్భంగా తీసింది అంటూ ఆధారాలతో బయటపెడుతున్నారు.

అయితే ఈ ఆధారంలో పవన్ భార్య ఇప్పుడు కట్టుకున్న చీర.. శ్రీజ పెళ్లిలో కట్టుకున్న చీర ఒక్కటే. అది తప్ప మరో బలమైన పాయింట్ లేదు. కానీ చూస్తోంటే పవన్ కళ్యాణ్‌ ఇప్పుడు ఈ లుక్ లో లేడు. అందుకే ఇది శ్రీజ రెండో పెళ్లిలో అన్నాతో తీసుకున్నా ఫోటోనే అంటున్నారు చాలామంది. అయితే ఈ విషయంలో జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్‌ అభిమానులు ఆయనకు సపోర్ట్ గా.. ఈ ఫోటో ఫేక్ అన్నవాళ్లకు వ్యతిరేకంగా విపరీతమైన పోస్ట్ లు పెడుతున్నారు.

Related Posts