టాలీవుడ్

ఇది సరిపోదు జీవీ ప్రకాష్‌

తమిళ్ లో మోస్ట్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకడుగా పేరు తెచ్చుకున్నాడు జివి ప్రకాష్‌ కుమార్. ఇతను ఏఆర్ రెహ్మాన్ కు మేనల్లుడు. చాలా చిన్న వయసులోనే సంగీత దర్శకుడయ్యాడు. అతని ఎంట్రీ తర్వాతే యువన్ శంకర్ రాజా, హారిస్ జయరాజ్ వంటి వారు వెనకబడ్డారు. అఫ్‌ కోర్స్ మరో ఎండ్ లో అనిరుధ్ కూడా ఉండటం వల్ల వీరి హవా తగ్గింది. సంగీతం చేస్తూనే హీరోగా మారాడు జీవి ప్రకాష్‌. అతన్ని అంతా పనిరాక్షసుడు అంటారు. అటు హీరోగా నటిస్తూనే ఇటు ఏ మాత్రం క్వాలిటీ తగ్గని సంగీతం ఇస్తున్నాడు. ఆ మధ్య తెలుగులో వచ్చిన సార్ చిత్రానికి అతనే సంగీతకారుడు. అందులో ఒక పాట మాత్రమే సూపర్ హిట్ అయింది.కానీ ఇది స్ట్రెయిట్ తెలుగు మూవీ అని చెప్పడానికి లేదు. బట్ ఆ ఛాన్స్ రవితేజ ఇచ్చాడు.


మాస్ మహరాజ్ రవితేజ టైగర్ నాగేశ్వరరావుకు జీవి ప్రకాష్‌ కుమార్ ను సంగీత దర్శకుడుగా తీసుకున్నారు. ఈ మూవీ నుంచి రీసెంట్ గా ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. అది ఏమంత ఆకట్టుకోలేదు. రవితేజ చాలా సినిమాల్లో చూసిన ఫంకీ సాంగ్స్ లానే అనిపించింది. సంగీత పరంగా, ట్యూన్ పరంగా పెద్దగా మెప్పించలేదు అనేది నిజం. అందుకే ఈ పాట ఎక్కడా పెద్దగా వినిపించడం లేదు.


ఇక లేటెస్ట్ గా సితార బ్యానర్ లో రూపొందుతోన్న ఆదికేశవ నుంచి మరో పాట విడుదలైంది. దీనికీ జీవి ప్రకాషే సంగీత దర్శకుడు. బట్ ఈ సాంగ్ కూడా ఏమంత ఆకట్టుకునేలా లేదు అనే చెప్పాలి. రెగ్యులర్ డ్యూయొట్ లానే కనిపిస్తోంది. ఇంకా చెబితే అతనే కంపోజ్ చేసిన ఓ తమిళ్ సినిమా పాటను గుర్తు చేస్తోంది. ఫస్ట్ లిరికల్ సాంగ్ అంటే ఆ సాంగ్ తోనే పెద్ద ఇంపాక్ట్ వేయాలి. అప్పుడే సినిమాకంటూ అంచనాలు మొదలవుతాయి. ఈ విషయంలో ఈ రెండు సినిమాల విషయంలో హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఇచ్చాడు అని చెప్పలేం. ఈ రెండు పాటలు చూస్తే అతనిపై అంచనాలు పెట్టుకోవడం ఎంత వరకూ కరెక్ట్ అనే ప్రశ్న మదిలో మెదిలితే ఆశ్చర్యమేం లేదు.


ఇక ఈ రెండూ ఓ రకంగా రెగ్యులర్ సాంగ్స్. అతనికి తన మార్క్ చూపించే అవకాశం రాలేదేమో అని ఇప్పటికి సరిపెట్టుకోవాలి. ఇక ఆర్ఆర్ తో ఏమైనా మెరుపులు చూపిస్తాడేమో కానీ.. అతని స్టాండర్డ్ ఇదే అయితే మాత్రం ఇది తెలుగు సినిమాకు సరిపోదు అనే చెప్పాలి.

Telugu 70mm

Recent Posts

Ongoing suspense over the Nani-Sujeeth movie

Natural Star Nani is on a good streak. He has a string of hits to…

43 mins ago

వి.ఎఫ్.ఎక్స్ పనులు పూర్తిచేసుకున్న విజయ్ ‘గోట్’

తమిళ దళపతి విజయ్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయినా విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక..…

50 mins ago

‘కల్కి’ సినిమా మొత్తానికి ఒకటే పాట?

ఈ ఏడాది పాన్ ఇండియా లెవెల్ లో రాబోతున్న క్రేజీ మూవీస్ లో 'కల్కి 2898 ఎ.డి.' ఒకటి. జూన్…

1 hour ago

రేపటి నుంచి మళ్లీ రంగంలోకి నటసింహం

నటసింహం బాలకృష్ణ కమిట్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్లాపుల్లో ఉన్నప్పుడే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ను లైన్లో…

2 hours ago

‘దేవర’ మొదటి పాట కోత.. రెండో పాట లేత

'దేవర' నుంచి మొదటి పాట మాత్రమే కాదు.. రెండో పాట కూడా బోనస్ గా రాబోతుంది. 'దేవర' నుంచి ఫస్ట్…

4 hours ago

నాని-సుజీత్ సినిమాపై కొనసాగుతోన్న సస్పెన్స్

నేచురల్ స్టార్ నాని మంచి దూకుడు మీదున్నాడు. 'శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి, దసరా, హాయ్ నాన్న'లతో వరుస విజయాలను…

5 hours ago