ఇది సరిపోదు జీవీ ప్రకాష్‌

తమిళ్ లో మోస్ట్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకడుగా పేరు తెచ్చుకున్నాడు జివి ప్రకాష్‌ కుమార్. ఇతను ఏఆర్ రెహ్మాన్ కు మేనల్లుడు. చాలా చిన్న వయసులోనే సంగీత దర్శకుడయ్యాడు. అతని ఎంట్రీ తర్వాతే యువన్ శంకర్ రాజా, హారిస్ జయరాజ్ వంటి వారు వెనకబడ్డారు. అఫ్‌ కోర్స్ మరో ఎండ్ లో అనిరుధ్ కూడా ఉండటం వల్ల వీరి హవా తగ్గింది. సంగీతం చేస్తూనే హీరోగా మారాడు జీవి ప్రకాష్‌. అతన్ని అంతా పనిరాక్షసుడు అంటారు. అటు హీరోగా నటిస్తూనే ఇటు ఏ మాత్రం క్వాలిటీ తగ్గని సంగీతం ఇస్తున్నాడు. ఆ మధ్య తెలుగులో వచ్చిన సార్ చిత్రానికి అతనే సంగీతకారుడు. అందులో ఒక పాట మాత్రమే సూపర్ హిట్ అయింది.కానీ ఇది స్ట్రెయిట్ తెలుగు మూవీ అని చెప్పడానికి లేదు. బట్ ఆ ఛాన్స్ రవితేజ ఇచ్చాడు.


మాస్ మహరాజ్ రవితేజ టైగర్ నాగేశ్వరరావుకు జీవి ప్రకాష్‌ కుమార్ ను సంగీత దర్శకుడుగా తీసుకున్నారు. ఈ మూవీ నుంచి రీసెంట్ గా ఫస్ట్ లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. అది ఏమంత ఆకట్టుకోలేదు. రవితేజ చాలా సినిమాల్లో చూసిన ఫంకీ సాంగ్స్ లానే అనిపించింది. సంగీత పరంగా, ట్యూన్ పరంగా పెద్దగా మెప్పించలేదు అనేది నిజం. అందుకే ఈ పాట ఎక్కడా పెద్దగా వినిపించడం లేదు.


ఇక లేటెస్ట్ గా సితార బ్యానర్ లో రూపొందుతోన్న ఆదికేశవ నుంచి మరో పాట విడుదలైంది. దీనికీ జీవి ప్రకాషే సంగీత దర్శకుడు. బట్ ఈ సాంగ్ కూడా ఏమంత ఆకట్టుకునేలా లేదు అనే చెప్పాలి. రెగ్యులర్ డ్యూయొట్ లానే కనిపిస్తోంది. ఇంకా చెబితే అతనే కంపోజ్ చేసిన ఓ తమిళ్ సినిమా పాటను గుర్తు చేస్తోంది. ఫస్ట్ లిరికల్ సాంగ్ అంటే ఆ సాంగ్ తోనే పెద్ద ఇంపాక్ట్ వేయాలి. అప్పుడే సినిమాకంటూ అంచనాలు మొదలవుతాయి. ఈ విషయంలో ఈ రెండు సినిమాల విషయంలో హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఇచ్చాడు అని చెప్పలేం. ఈ రెండు పాటలు చూ