వినూత్నంగా ‘ఓం భీమ్ బుష్..‘ ప్రమోషన్స్

సినిమాని తెరకెక్కించడం ఒకెత్తయితే.. ఆ చిత్రాన్ని ఆడియన్స్ లోకి తీసుకెళ్లడం మరొక ఎత్తు. అందుకే.. తమ సినిమాని ప్రేక్షకులకు చేరువ చేయడానికి ప్రచారంలో సరికొత్త పదనిసలు పలికిస్తుంటారు మేకర్స్. లేటెస్ట్ గా శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన కామెడీ ఎంటర్ టైనర్ ‘ఓం భీమ్ బుష్..‘ ప్రచారంలో టీమ్ వినూత్న పద్ధతులు అవలంభిస్తుంది.

మార్చి 22న విడుదలకు ముస్తాబవుతోన్న ఈ మూవీకోసం లీడ్ యాక్టర్స్ శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ చేసిన ప్రమోషన్ వీడియో అందరిలోనూ అటెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఆమధ్య జరిగిన అంబానీల ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో ఈ ముగ్గురూ సందడి చేసినట్టు సాగిన ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

ఇక.. మన జీవితాలలో ఎంటర్టైన్మెంట్ నింపడానికి.. ఈ ముగ్గురు వచ్చేసారహో అంటూ ‘ఓం భీమ్ బుష్’ టీజర్ లోనే ఈ సినిమా ఫుల్ లెన్త్ ఎంటర్ టైనర్ గా వస్తుందని చెప్పారు మేకర్స్. ‘నో లాజిక్.. ఓన్లీ ఎంటర్ టైన్ మెంట్‘ అనే యాంగిల్ లో ఈ మూవీని ఓ ఫన్ రైడ్ లా తెరకెక్కించాడట డైరెక్టర్ హర్ష కొనుగంటి. ముగ్గురు స్నేహితులు కలిసి ఒక గ్రామంలో గుప్త నిధుల అన్వేషణ గురించి చేసే ప్రయత్నాన్ని ఈ సినిమాలో ఫన్నీ వే లో చెప్పినట్టు ఇటీవల ఓ ఇంటర్యూలో వెల్లడించాడు డైరెక్టర్ హర్ష కొనుగంటి. వి సెల్యులాయిడ్ బ్యానర్ పై వి సెల్యూలాయిడ్, సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ‘ఓం భీమ్ బుష్‘ ట్రైలర్ రాబోతుంది.

Related Posts