HomeMoviesటాలీవుడ్మూడు నెలలు పాటు ముంబైలోనే ఎన్టీఆర్

మూడు నెలలు పాటు ముంబైలోనే ఎన్టీఆర్

-

‘దేవర‘ ఫినిషింగ్ స్టేజ్ కు వస్తుండడంతో ఇప్పుడు యంగ్ టైగర్ తన తర్వాతి చిత్రం ‘వార్ 2‘పై ఫోకస్ పెడుతున్నాడు. మరికొన్ని రోజుల్లో ఈ సినిమాకోసం ముంబై వెళ్లనున్నాడు. అక్కడే దాదాపు మూడు నెలలపాటు మకాం వేయనున్నాడట. అందుకు ప్రధాన కారణం ‘వార్ 2‘.

‘బ్రహ్మాస్త్ర‘ ఫేమ్ అయన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న క్రేజీ మల్టీస్టారర్ ‘వార్ 2‘. గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో కథానాయకులుగా నటిస్తున్నారు. ఇతర కీలక పాత్రల్లో జాన్ అబ్రహం, కియారా అద్వానీ కనిపించనున్నారు. మొదటగా హీరోలిద్దరూ లేకుండానే ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టాడు అయన్ ముఖర్జీ. ఇటీవలే ఈ మూవీ షూట్ లో హృతిక్ రోషన్ జాయిన్ అయ్యాడు.

త్వరలో ఎన్టీఆర్ ‘వార్ 2‘ కోసం ముంబై వెళతాడట. ఈ మూవీలో ఎన్టీఆర్ ఇండియన్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడనే ప్రచారం ఈమధ్య జోరుగా సాగింది. అలాగే.. తారక్ రోల్ నెగటివ్ షేడ్స్ తో ఉంటుందనే టాక్ కూడా ఉంది. అదేగానీ జరిగితే ‘జై లవ కుశ‘ తర్వాత మరోసారి ఎన్టీఆర్ నెగటివ్ షేడ్స్ లో నటించే సినిమా ఇదే అవుతుంది. ఇప్పటివరకూ ఇండియన్ మూవీస్ లో చూడనటువంటి నెవర్ బిఫోర్ యాక్షన్ ఘట్టాలతో అయన్ ముఖర్జీ ‘వార్ 2‘ని తీర్చిదిద్దుతున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లో యాభై ఏళ్లకు పైగా నిర్మాణ రంగంలో కొనసాగుతోన్న యష్ రాజ్ ఫిల్మ్స్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

ఇవీ చదవండి

English News