ముగ్గురు ముద్దుగుమ్మలతో ప్రభాస్ మాస్ డ్యాన్స్

ఈమధ్య వరుసగా యాక్షన్ మూవీస్ తో అభిమానుల్ని అలరిస్తున్న రెబెల్ స్టార్ ప్రభాస్.. మారుతి దర్శకత్వంలో చేస్తున్న ‘రాజా సాబ్‘ కోసం రొమాంటిక్ మోడ్ లోకి మారుతున్నాడు. హారర్ కామెడీ జానర్ లో రూపొందుతోన్న ఈ మూవీలో ప్రభాస్ కి జోడీగా ముగ్గురు ముద్దుగుమ్మలు నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ నటిస్తున్నారు. ఒక పాటలో ఈ ముగ్గురితోనూ కలిపి ప్రభాస్ వేసే మాస్ స్టెప్పులు ఫ్యాన్స్ ను ఉర్రూతలూగించనున్నాయట.

‘రాజా సాబ్‘తో మళ్లీ వింటేజ్ ప్రభాస్ ను ఆవిష్కరించబోతున్నాడట మారుతి. ‘డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్, మిర్చి‘ మూవీస్ లో ప్రభాస్ ఏరీతిన రొమాంటిక్ గా అదరగొట్టాడో.. అలాగే ‘రాజా సాబ్‘లోనూ కనువిందు చేయనున్నాడట. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఇప్పటికే సగభాగం చిత్రీకరణ పూర్తిచేసుకుంది. త్వరలోనే.. ఈ సినిమా తిరిగి పట్టాలెక్కనుంది. వచ్చే యేడాది ప్రథమార్థంలో ‘రాజా సాబ్‘ను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Related Posts