ఇళయదళపతి పొలిటికల్ ఎంట్రీ

తమిళ్ రాజకీయాల్లో సినిమా ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. నాటి ఎమ్జీఆర్, కరుణానిధి, జయలలిత నుంచి నేటి రాజకీయాల వరకూ కూడా సినిమా వాళ్ల ప్రభావం చాలానే ఉంటుంది. కొన్నేళ్లుగా తమిళ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నా ఇస్తున్నా అంటూ ఊరించి ఊరించి చివరికి తుస్సు మనిపించాడు సూపర్ స్టార్ రజినీకాంత్.

ఆయన సమకాలీకుడు కమల్ హాసన్ పార్టీ పెట్టాడు కానీ ప్రభావం చూపించలేకపోతున్నాడు. ఇక ఇప్పుడు మరో టాప్ హీరో విజయ్ కూడా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అంటూ కోలీవుడ్ కోడై కూస్తోంది. మామూలుగా విజయ్ ఫ్యాన్స్ కూడా ఎప్పటి నుంచో ఆయన్ని రాజకీయాల్లోకి రావాలని కోరుతున్నారు. కొన్నాళ్ల క్రితం అతని తండ్రి ఈ మేరకు అనౌన్స్ మెంట్ కూడా చేశాడు. బట్ అప్పుడు విజయ్ దాన్ని ఖండించాడు.

తన తండ్రి స్టేట్మెంట్ తో తనకు సంబంధం లేదని కూడా చెప్పాడు. బట్ ఇప్పుడు చూస్తుంటే అతను రాజకీయ అడుగులు వేగంగా పడుతున్నట్టు కనిపిస్తోంది. ఆల్రెడీ ” విజయ్ మక్కల్ ఇయక్కం” అనే సంస్థ స్థాపించి చాలాకాలంగా సోషల్ సర్వీస్ చేస్తున్నాడు విజయ్. దీనికి సంబంధించిన పనులు కూడా అభిమానులే చూసుకుంటారు.

ఇక రీసెంట్ గా తమిళనాడులో టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ లో ముగ్గురు ముగ్గురు టాపర్స్ కు ప్రోత్సాహకంగా నగదు బహుబతులు కూడా అందించాడు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజక వర్గాల్లో రాత్రి బడులు కూడా నిర్వహిస్తున్నారు ఈ సంస్థ ద్వారా. ఇక ఈ మధ్య తరచుగా అభిమానులతో కలుస్తున్నాడు. ఈ మేరకు అభిమాన సంఘాల నేతలు చెబుతున్నది ఏంటంటే.. విజయ్ పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధం అయింది. ఆ మధ్య లియో సినిమా టైమ్ లో కూడా ఇదే అతని ఆఖరి సినిమా అని వార్తలు కూడా వచ్చాయి.


ఇక అన్నిటికంటే సెన్సేషనల్ విషయం ఏంటంటే.. విజయ్ త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేయాలనుకుంటున్నాడట. తమిళ రాజకీయాల్లో పాదయాత్రలు లేవు. దీంతో విజయ్ పాదయాత్ర అంశం సంచలనంగా మారింది. ప్రస్తుతం అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న స్టాలిన్ వయసు చాలా ఎక్కువే. ఆ తర్వాత ఆ స్థాయిలో ప్రభావం చూపగల నేతలు తమిళనాడులో ఇప్పుడు లేరు అనే చెప్పాలి.

దీంతో విజయ్ కి ఇది మంచి అవకాశం అనే అంటున్నారు. కాస్త కష్టపడి.. ప్రజల్లో నమ్మకం పెంచగలిగితే ఖచ్చితంగా చాలా తక్కువ టైమ్ లోనే సిఎమ్ సీట్ దక్కే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. మరి విజయ్ పాదయాత్ర అంశం పై ఏదైనా అఫీషియల్ ప్రకటన వస్తే కానీ ఇది నిజమో కాదో తెలియదు.

Related Posts