నాని ‘హాయ్ నాన్న’ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తెలుగుతో పాటు పలు భాషల్లో ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకోసం ముంబై, చెన్నై వంటి ప్రదేశాల్లో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నాడు నాని. ఈ సినిమా ప్రచారం కోసం త్వరలో అమెరికాలోనూ సందడి చేయబోతున్నాడు. ఇక.. ఇప్పుడు ‘హాయ్ నాన్న’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సమయం ఆసన్నమైంది. నవంబర్ 29న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది.
వైజాగ్ ఆర్.కె. బీచ్ లోని గోకుల్ పార్క్ వద్ద ఆరోజు సాయంత్రం 6 గంటల నుంచి ‘హాయ్ నాన్న’ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. సముద్రం ఒడ్డున భారీ జన సందోహం మధ్య ఈ వేడుకను ఘనంగా జరపడానికి ప్రణాళిక సిద్ధమవుతోంది. చిత్ర బందంతో పాటు.. సినీ, రాజకీయాలకు సంబంధించిన పలువురు అతిథులు ఈ ఈవెంట్ లో సందడి చేయనున్నారట.
హేషమ్ అబ్దుల్ వహబ్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి ‘ఓడియమ్మ’ అంటూ సాగే పార్టీ సాంగ్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పాటలో నానితో పాటు శ్రుతి హాసన్ సందడి చేయబోతుంది. రేపు (నవంబర్ 28) సాయంత్రం 4 గంటలకు ఈ పాట విడుదలకానుంది. ఈ చిత్రంలోఓ నానికి జోడీగా మృణాల్ ఠాకూర్ నటించగా.. శ్రుతి హాసన్ కేమియోలో మురిపించనుంది. వైరా ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన ఈ చిత్రానికి శౌర్యువ్ దర్శకత్వం వహించాడు. ఫుల్ లెన్త్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ‘హాయ్ నాన్న’ డిసెంబర్ 7న విడుదలవుతోంది.
సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్ కు ఓటిటి మధ్య కనీస గ్యాప్ ఉండటం చాలా అవసరం.…
రాబోయే మూడు నెలల్లో 'కల్కి' తర్వాత పాన్ ఇండియా లెవెల్ లో అలరించడానికి రాబోతున్న మరో తెలుగు చిత్రం 'పుష్ప…
'హనుమాన్' మూవీతో నయా స్టార్ గా అవతరించిన తేజ సజ్జ హీరోగా నటిస్తున్న చిత్రం 'మిరాయ్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బర్త్ డే.. మరో రెండు రోజులు మాత్రమే ఉంది. యంగ్ టైగర్ బర్త్ డే…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ 'విశ్వంభర'. 'బింబిసార' ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.…
Any update regarding Tamil Dalapathy Vijay goes viral on social media within moments of its…