ఎన్టీఆర్ కు హీరోయిన్ సెట్ అయింది..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూకుడు పెంచాడు. 2018లో అరవింద సమేత తర్వాత ఆర్ఆర్ఆర్ కోసం చాలాటైమ్ పట్టింది. మధ్యలో కోవిడ్ కూడా రావడంతో ఇంకా ఎక్కువ టైమ్ లాస్ అయ్యాడు. ఆర్ఆర్ఆర్ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయడానికీ ఏకంగా యేడాదికి పైగా టైమ్ తీసుకున్నాడు.

ఈ మూవీ రావడానికి మరో యేడాది పడుతుంది. మొత్తంగా ఏడేళ్లలో కేవలం మూడు సినిమాలు మాత్రమే చేసినట్టఅవుతుంది. అందుకే ఇకపై అంత గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్ గా మూవీస్ ప్లాన్ చేసుకున్నాడు.

అందులో భాగంగా ఇప్పుడు చేస్తోన్న కొరటాల శివ మూవీ దేవరతో పాటు మరో రెండు ప్రాజెక్ట్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉన్నాడు. వీటిలో ప్రశాంత్ నీల్ సినిమా ఎప్పుడో ఫిక్స్ అయింది. ఈ యేడాది నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. కాస్త అటూ ఇటూగా అదే టైమ్ నుంచి మరో సినిమా కూడా స్టార్ట్ అవుతుంది. అదే బాలీవుడ్ ప్రాజెక్ట్ వార్2.


ఎన్టీఆర్ ఫస్ట్ టైమ్ చేయబోతోన్న బాలీవుడ్ మూవీ వార్2. హృతిక్ రోషన్ మరో హీరోగా నటిస్తోన్న ఈ మూవీ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్. యశ్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో రూపొందబోతోన్న ఈ చిత్రానికి బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ దర్శకుడు.

అయితే ఫస్ట్ పార్ట్ ను మాత్రం సిద్ధార్థ్ ఆనంద్ డైరక్ట్ చేయగా హృతిక్ రోషన్ తో పాటు టైగర్ ష్రాఫ్‌ హీరోలుగా నటించారు. అప్పుడు ఈ మూవీలో వాణీ కపూర్ హీరోయిన్. ఇక ఇప్పుడు యంగ్ టైగర్ ఎంట్రీతో ప్రాజెక్ట్ కు ఓ రేంజ్ వచ్చినట్టే అని చెప్పాలి. ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ కు ఇప్పుడు గ్లోబల్ ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ ఈ చిత్రానికి పెద్ద ఎసెట్ అవుతుంది.


వార్ 2లో హీరోయిన్ గా కియారా అద్వానీని ఫైనల్ చేశారు. హీరోయిన్ సెలెక్షన్ పూర్తిగా డైరెక్టర్ డెసిషన్ అంటున్నారు. ఇక విశేషం ఏంటంటే.. యశ్ రాజ్ ఫిల్మ్స్ అంటే ఒకప్పుడు కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కు కేరాఫ్‌. బట్ ఈ మూవీస్ ను ఒక సిరీస్ గా ప్లాన్ చేసుకున్నారు.

సల్మాన్ ఖాన్ ఏక్ థా టైగర్ నుంచి ”వైఆర్ఎఫ్ స్పై యూనివర్స్” అనే సబ్ బ్యానర్ లా సెట్ చేసుకుని అప్పటి నుంచి టైగర్ జిందా హై, వార్, పఠాన్, టైగర్3, వార్2 చిత్రాలను రూపొందిస్తున్నారు. మరి ఏదో ఒకరోజు ఈ స్పై స్టార్స్ అంతా ఒకే సినిమాలో కనిపిస్తారేమో. ఏదేమైనా యంగ్ టైగర్ తో కియారా రొమాన్స్ చేయబోతుండటం ఫస్ట్ టైమ్. మరి ఈ బ్యూటీ వార్ 2 కు ఎంత ఫేవర్ చేస్తుందో చూడాలి.

Related Posts