గుంటూరు కారం జూన్ లోనే లేదు

మహేష్‌ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా గుంటూరు కారం. పూజాహెగ్డే, శ్రీ లీల హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని హారిక హాసిని బ్యానర్ రూపొందిస్తోంది.

అయితే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ విషయంలో అనేక ఇష్యూస్ వస్తున్నాయి. ప్రారంభించిన దగ్గర్నుంచీ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉన్నాయి. ముందుగా అనుకున్న కథే క్యాన్సిల్ అయింది. తర్వాత మరో కథ వచ్చింది. ఈ కథ కూడా సజావుగా షూటింగ్ జరుపుకోవడం లేదు.

కొన్నాళ్లుగా మహేష్‌ డేట్స్ లో వచ్చిన ఇబ్బందులు కారణంగా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. ప్రతి రోజూ ఇదుగో అదుగో అంటున్నారు. అందులో నిన్న(శుక్రవారం)టి నుంచి షూటింగ్ స్టార్ట్ కావాల్సి ఉంది. బట్ కాలేదు. దీంతో ఈ నెల 20 నుంచి స్టార్ట్ అవుతుందీ అన్నారు. దాదాపు ఇది ఫనల్ అన్నట్టుగా చెప్పారు. బట్ ఈ నెల 20నే కాదు. అసలు ఈ నెలలోనే గుంటూరు కారం షూటింగ్ లేదు అని తెలుస్తోంది.


మామూలుగాస్టార్ హీరోల సినిమాల్లోనూ స్టార్స్ ఉంటారు. వారి డేట్స్ లో క్లాష్ వస్తే మళ్లీ సెట్ చేయడం కష్టంగా ఉంటుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి ఇదే సమస్య. ముందు మహేష్‌ బాబు చెప్పిన డేట్స్ లో షూటింగ్ కు రాలేదు.

దీంతో ఇతరుల డేట్స్ మారిపోయాయి. అందులో హీరోయిన్ శ్రీ లీలతో పాటు ప్రకాష్‌ రాజ్ డేట్స్ కూడా ఉన్నాయి. ఈ ఇద్దరూ ఎంత బిజీగా ఉన్నారో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ నెల 20 నుంచి వీరు అందుబాటులో ఉండటం అసాధ్యమట. అందుకే షూటింగ్ స్టార్ట్ కావడం కుదరదు అంటున్నారు. వేరేవారితో చేయొచ్చు కదా అనుకోవచ్చు. బట్.. వీరి కాంబినేషన్ లోనే షూటింగ్ ప్లాన్ చేసుకున్నారట. అందుకే మరోసారి పోస్ట్ పోన్ అయింది.


ఇక మరోవైపు ఈ చిత్రంలో ప్రకాష్‌ రాజ్ నివసించే ఇంటికోసం వెదుకులాట సాగుతోంది అనే టాక్ కూడా ఉంది. ముందుగా ఈ ఇంటి సెట్ వేద్దాం అనుకున్నారట. కానీ సెట్ ఐడియాకు దగ్గరగా ఉండే ఇల్లు చూసుకుంటే సరిపోతుందని ఆగారు. తీరా షూటింగ్ టైమ్ దగ్గరకు వచ్చాక చూస్తే ఇల్లు దొరకలేదు అని టాక్.

ఇంకా ఆలస్యం కావడానికి అదీ ఓ కారణం అంటున్నారు. అదే టైమ్ లో ఈ డేట్స్ లో ప్రకాష్ రాజ్ కు కొన్ని పొలిటికల్ మీటింగ్స్, శ్రీ లీలకు ఇతర సినిమాల షూటింగ్స్ కూడా ఉన్నాయంటున్నారు. ఆ కారణంగా గుంటూరు కారం నెక్ట్స్ షెడ్యూల్ జూలైకి వెళ్లింది. మరి జూలైలో ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది ఇంకా క్లారిటీ లేదు.

Related Posts