బిగ్ బాస్ సీజన్ 7 మరో మూడు రోజుల్లో ప్రారంభం కాబోతోంది. సెప్టెంబర్ 3 నుంచి ఈ రియాలిటీ మొదలవుతోంది. ఇప్పటి వరకూ కంటెస్టెంట్స్ విషయంలో పూర్తి క్లారిటీ లేదు. కొన్ని పేర్లు బయటకు వచ్చాయి. కానీ ఎప్పట్లానే హౌస్ లోకి ఎంటర్ అయ్యే వరకూ పూర్తి క్లారిటీ రాదు. అయితే ఈ సారి ఒకప్పటి హీరో శివాజీ బిగ్ బాస్ లోకి ఎంటర్ అవుతున్నాడు అనే వార్త ఖచ్చితంగా వినిపిస్తోంది.
చిన్న చిన్న పాత్రలతో పరిచయం అయ్యి.. మీడియం రేంజ్ హీరోగా ఒకప్పుడు వరుస సినిమాలతో ఆకట్టుకున్నాడు శివాజీ. కొన్నేళ్ల క్రితమే సినిమాలకు దూరం అయ్యాడు. పొలిటికల్ గా బాగా యాక్టివ్ గా ఉన్నాడు. అయితే అతను ఏ పార్టీలోనూ ప్రత్యక్షంగా చేరకపోయినా.. ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ ఉంటాడు.
అలాంటి శివాజీ సడెన్ గా బిగ్ బాస్ అంటే కాస్త ఆశ్చర్యమే అయినా.. ఖచ్చితంగా అతని టైమింగ్, వాగ్ధాటి బిగ్ బాస్ లో మంచి హంగామా క్రియేట్ చేస్తుందని మాత్రం చెప్పొచ్చు.అయితే శివాజీ తనను బిగ్ బాస్ విన్నర్ గా చేస్తానంటేనే ఈ షోకి వస్తాను అన్నట్టు సమాచారం. పైగా పేమెంట్ కూడా అందరికంటే ఎక్కువే అంటున్నారు. కాకపోతే పొలిటికల్ గా తిరుగుతూ నిత్యం బిజీగా ఉంటోన్న శివాజీ ఈ హౌస్ లో ఏ ఫెసిలిటీ లేకుండా ఉండగలడా.. యంగ్ స్టర్స్ తో పోటీ పడుతూ ఆటల్లో నిలవగలడా అనేదే పెద్ద సందేహం.
శివాజీ వయసు ఇప్పుడు 46యేళ్లు. ఈ వయసులో కుర్రాళ్లతో పోటీ పడటం పెద్ద కష్టమేం కాదు. పైగా అతను అలా కనిపించడు కూడా. అదే టైమ్ లో హౌస్ లో కాస్త డామినేటింగ్ గానూ కనిపించే అవకాశం ఉంది. మరి శివాజీ గేమ్ ఎలా ఉంటుందో చూడాలి.
ఈరోజు (మే 11) సుధీర్ బాబు బర్త్ డే స్పెషల్ గా 'హరోం హర' నుంచి కొత్త పాట వచ్చింది.…
Before 'Acharya', Koratala Siva was in the list of directors who did not succeed in…
‘ఆచార్య‘ ముందు వరకూ తెలుగులో అపజయమెరుగని దర్శకుల లిస్టులో ఉండేవాడు కొరటాల శివ. అయితే.. మెగా మల్టీస్టారర్ ‘ఆచార్య‘ కొరటాల…
The Bharat Ratna Award is India's highest civilian award. Bharat Ratna is awarded to those…
భారతరత్న పురస్కారం భారతదేశంలో పౌరులకు అందే అత్యుత్తమ పురస్కారం. కళ, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాలలో అత్యుత్తమ కృషి చేసిన…
Energetic star Ram, who came before the audience with last year's movie 'Skanda', is going…