టాలీవుడ్

బాయ్స్ హాస్టల్ లాంటి మ్యాడ్

రీసెంట్ గా కన్నడలో వచ్చిన సినిమా హాస్టల్ హుడుగర్ బేకాయిద్దర. శాండల్ వుడ్ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచిందీ చిత్రం. దీంతో కాంతార రేంజ్ లో ఇక్కడా కాసులు కురిపిస్తుందని ఇమ్మీడియొట్ గా డబ్బింగ్ చేశారు. బట్ తెలుగులో ఆ చిత్రాన్ని ఎవరూ పట్టించుకోలేదు. ఒక్కటీ తెలిసిన మొహం కాదు. పైగా ఆ కామెడీ ఇక్కడి ఆడియన్స్ కు కనెక్ట్ కాలేదు.

బట్ ఆ తరహా నేటివిటీ ఉన్న కథతోనే వస్తున్నట్టుగా కనిపిస్తోన్న సినిమా ‘ మ్యాడ్’. విశేషం ఏంటంటే.. ఈ మూవీతో హారిక హాసిని బ్యానర్ నుంచి మరో నిర్మాత పరిచయం అవుతోంది. యస్.. హారిక హాసిని పేరులోని హారిక ఈ చిత్రంతో నిర్మాతగా తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్నారు.

ఈ సినిమాకు సితార నాగవంశీ ప్రెజెంటర్ గా ఉన్నాడు. టాప్ ప్రొడ్యూసర్, అభిరుచిగల నిర్మాతగా పేరు తెచ్చుకున్న సూర్యదేవర రాధాకృష్ణ అలియాస్ చినబాబు కూతురే ఈ హారిక. ఫస్ట్ మూవీతోనే బెస్ట్ కంటెంట్ తో వస్తున్నట్టుగా కనిపిస్తోంది ఈ టీజర్ చూస్తోంటే. మ్యాడ్ అనే టైటిల్ ఆకట్టుకునేలా ఉంది.

కాలేజ్ అండ్ హాస్టల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన సినిమాలా కనిపిస్తోంది. అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లా కనిపిస్తోందీ సినిమా కథ. ఇప్పటి వరకూ కొన్ని సినిమాలు, యూ ట్యూబ్స్, వెబ్ సిరీస్ లలో కనిపించిన ఆర్టిస్టులతో పాటు కొందరు కొత్తవాళ్లు కూడా ఈ మూవీలో ఉన్నారు. అన్నట్టు జాతిరత్న అనుదీప్ కూడా ఒక ఫ్రేమ్ లో మెరిశాడు. అతను ఫుల్ లెంగ్త్ రోల్ చేస్తున్నాడా లేక జస్ట్ అప్పీరియన్సా అనేది చూడాలి.


మన కాలేజ్ లో స్పోర్ట్స్ క్లబ్, డ్రామా క్లబ్, ఎన్.సిసి అన్నీ ఉన్నాయి. మన కాలేజ్ లో లేంది.. ర్యాగింగ్ అనే డైలాగ్ రాగానే నిజంగా ర్యాగింగ్ స్టార్ట్ అవుతుంది. ఆ ర్యాగింగ్ అంతా ఫుల్ ఫన్ తో నిండి ఉంది. ఇక కంటెంట్ ను బట్టి సీనియర్స్, జూనియర్స్ మధ్య వార్ లా.. ఆ వార్ కు కేంటీన్ సెంటర్ పాయింట్ లా ఉన్నట్టు కనిపిస్తోంది. మ్యాడ్ టీజర్ చూస్తే కంప్లీట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ లా ఉంది. అలాగే సీనియర్స్ కూ వారి కాలేజ్ డేస్ ను గుర్తు చేసేలా ఉంది. చూస్తోంటే.. మరో హ్యాపీడేస్ అయ్యేలా ఉందనే కమెంట్స్ వస్తున్నాయి. ఈ మ్యాడ్ తో తెలుగు పరిశ్రమకు పరిచయం అవుతున్న కొత్త నిర్మాత హారికకు ఆల్ ద బెస్ట్ చెప్పేద్దాం.

Telugu 70mm

Recent Posts

Daksha Nagarkar

13 mins ago

Rashi Singh

17 mins ago

మహేష్-రాజమౌళి మూవీ కాస్టింగ్ డైరెక్టర్ పై క్లారిటీ

సూపర్ స్టార్ మహేష్ బాబు తో దర్శకధీరుడు రాజమౌళి చేయబోయే సినిమా 'ఎస్.ఎస్.ఎమ్.బి.29'. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న…

54 mins ago

‘కన్నప్ప’ సినిమాలోని కీలక పాత్రలో కాజల్

మంచు విష్ణు ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ 'కన్నప్ప'లో తారల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకూ ఈ ప్రాజెక్ట్ లోకి వరుసగా అగ్ర…

2 hours ago

Mirnalini Ravi

2 hours ago