మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా మారాడు. ఆర్ఆర్ఆర్ తో వచ్చిన ఇమేజ్ తో పాటు ఆల్రెడీ ఉన్న మగధీర క్రేజ్ తో ప్యాన్ ఇండియన్ లెవల్లో టాప్ స్టార్స్ లో ఒకడుగా మారాడు.అయితే ఆర్ఆర్ఆర్ హైప్ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకువెళ్లేందుకు టాప్ డైరెక్టర్ శంకర్ తో టై అప్ అయ్యాడు.
శంకర్ అంటే రాజమౌళి కంటే ముందే ప్యాన్ ఇండియన్ సినిమాలు తీశాడు కదా. అందుకే ఇక రామ్ చరణ్ కెరీర్ ఎక్కడికో వెళుతుంది అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే చాలా వేగంగా షూటింగ్స్ అవీ స్టార్ట్ చేశారు. ఇంతలో శంకర్ కు పాత కేస్ నుంచి తీర్పు వ్యతిరేకంగా వచ్చింది. దీంతో ఆగిపోయిన భారతీయుడు2ను పూర్తి చేయాల్సి వచ్చింది.
అయితే ఓ దశలో రెండు సినిమాల షూటింగ్స్ ను బ్యాలన్స్ చేసుకుంటానంటూ ప్రయత్నించాడు. ఒక వారం భారతీయుడు, ఒక వారం రామ్ చరణ్ మూవీకి. బట్ కుదర్లేదు. ఇక రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మూవీ టైటిల్ ను ”గేమ్ ఛేంజర్” అంటూ అనౌన్స్ చేశాడు. కానీ ఈ మూవీ గేమ్ సాగుతోందా ఆగిందా అనే క్లారిటీ మాత్రం రావడం లేదు.
నిజానికి కొన్నాళ్లుగా గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఏ అప్డేట్ లేదు. అసలుషూటింగ్ జరుగుతుందా లేదా అనేది ఎవరికీ తెలియడం లేదు. ఓ నెలన్నర క్రితం మాత్రం రెండు వందలమందితో ఓ పాట చిత్రీకరిస్తున్నారు అన్నారు. అంతే. ఆ తర్వాత గేమ్ చేంజర్ ఊసులే లేవు. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది అనే రూమర్స్ మొదలయ్యాయి.
మరి ఆగుతుందా అంటే చెప్పలేం. సినిమాకు సంబంధించి ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహిస్తారు. లేదంటే కనీసం ఒక్క అప్డేట్ కూడా ఉండదా.. అనేది రూమర్ రాయుళ్ల ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పేది ఎవరు అంటే ఎవరూ కనిపించడం లేదు. పోనీ ఇదేమైనా చిన్నా చితకా నిర్మాత చేస్తోన్న సినిమానా అంటే అదీ కాదు. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. అలాంటిది ఆయన్నుంచి కానీ ఆయన టీమ్ నుంచి కానీ ఈ చిత్రానికి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడం విచిత్రమే. మరి ఇలాంటప్పుడే కదా అలాంటి రూమర్స్ వస్తాయి.
ఇక భారీ తారాగణంతో మొదలైన గేమ్ ఛేంజర్ లో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. సునిల్ తో పాటు అంజలి, ఎస్జే సూర్య, జయరాం, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీళ్లలో ఎవరూ కూడా ఈ మూవీ గురించి మాట్లాడ్డం లేదు. అంటే ప్రస్తుతానికి గేమ్ ఛేంజర్ షూటింగ్ మాత్రం హోల్డ్ లో ఉందనే అనుకోవాలి.
ఏదేమైనా రామ్ చరణ్ కూడా ప్రస్తుతం మరే మూవీ షూటింగ్ లోనూ లేడు. అలాంటప్పుడు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని మెగా ఫ్యాన్స్ కూ ఉంటుంది కదా..? మరి వారికి దిల్ రాజు ఏదైనా సమాధానం చెబుతాడా అనేది చూడాలి.
Some stars are offered successive opportunities even before the release of their first film. Pune…
'Devara' business figures have come out in Telugu states. It seems that this movie has…
Actress Amala Paul gave birth to a baby boy. Amala Paul said on social media…