మైత్రీ సంస్థకు కోట్లు కురిపించిన ‘హనుమాన్’

నిర్మాణ రంగంలోకి ప్రవేశించిన రెండు మూడేళ్లలోనే అగ్ర సంస్థగా అవతరించింది మైత్రీ మూవీ మేకర్స్. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ నిర్మాణ రంగంలో తమకు తిరుగులేదనిపించింది. ‘పుష్ప’తో పాన్ ఇండియా లెవెల్ లోనూ సత్తా చాటింది. ఇక.. పోయినేడాది సంక్రాంతి బరిలో చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’, బాలకృష్ణతో ‘వీరసింహారెడ్డి’ చిత్రాలు నిర్మించడమే కాకుండా.. వాటిని నైజాంలో సొంతంగా విడుదల చేసి ఘన విజయాలు సాధించింది మైత్రీ మూవీ మేకర్స్.

ఇదే ఊపులో ప్రభాస్ మోస్ట్ అవైటింగ్ ‘సలార్’ని నైజాం లో విడుదల చేసింది. ‘సలార్’ నైజాం హక్కులను రికార్డు లెవెల్ లో భారీ మొత్తానికి దక్కించుకుంది. అంతే స్థాయిలో ఘన విజయాన్నందుకుంది. ఇక ‘సలార్’ విజయానికి మించిన రీతిలో ‘హనుమాన్’తో డిస్ట్రిబ్యూటర్స్ గా మరో భారీ హిట్ అందుకుంది మైత్రీ సంస్థ. ‘హనుమాన్’ని నైజాంలో పంపిణీ చేసిన మైత్రీ మూవీ మేకర్స్.. అన్ని ఖర్చులు పోగా ఈ చిత్రంతో ఏకంగా రూ.30 కోట్లు లాభాన్ని పొందిందట. ఈమధ్య కాలంలో ఒక ఏరియాకి ఇంత లాభాన్ని ఆర్జించిన సంస్థ మరొకటి లేదు.

లేటెస్ట్ గా వరుణ్ తేజ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రాన్ని నైజాంలో పంపిణీ చేస్తుంది మైత్రీ. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ తో ఆద్యంతం విజువల్ ట్రీట్ అందించడానికి మార్చి 1న ఈ సినిమా రాబోతుంది. తెలుగుతో పాటు హిందీలో ‘ఆపరేషన్ వాలెంటైన్’ విడుదలవుతోంది.

Related Posts