‘ఓం భీమ్ బుష్’ టీజర్.. నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్

మన జీవితాలలో ఎంటర్టైన్మెంట్ నింపడానికి.. ఈ ముగ్గురు వచ్చేసారహో అంటూ ‘ఓం భీమ్ బుష్’ టీజర్ రిలీజ్ చేసింది టీమ్. ఈ సినిమా ట్యాగ్ లైన్లో చెప్పినట్టు.. ఈ సినిమాని నో లాజిక్.. ఓన్లీ ఎంటర్ టైన్ మెంట్ అనే యాంగిల్ లో డైరెక్టర్ హర్ష కొనుగంటి తీర్చిదిద్దినట్టు తెలుస్తోంది. హీరోలు ముగ్గురూ శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ సైంటిస్టులుగా ఓ ఊరిలోకి ఎంటరవ్వడం.. అక్కడ బ్లాక్ మ్యాజిక్.. ఆ తర్వాత గుప్త నిధుల అన్వేషణ ఇలా.. కథ రకారకాలుగా ముందుగా సాగుతోంది. ఫైనల్ గా ఎంటర్ టైన్ మెంటే పరమావధిగా ఈ చిత్రం తెరకెక్కినట్టు టీజర్ ఉంది. యు.వి.క్రియేషన్స్ నుంచి వస్తోన్న ఈ మూవీ టీజర్ అయితే ఆద్యంతం ఆకట్టుకుంటోంది. మరి.. మార్చి 22న విడుదలకాబోతున్న సినిమా ఏ రీతిన ఆకట్టుకుంటుందో చూడాలి.

Related Posts