సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన ‘హనుమాన్‘

‘హనుమాన్‘ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం వేయికళ్లతో ఎదురుచూశారు సినీ లవర్స్. సంక్రాంతి బరిలో విడుదలైన మిగతా అన్ని చిత్రాలు ఓటీటీలోకి వచ్చేసినా.. ‘హనుమాన్‘ మాత్రం రాలేదు. మరోవైపు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి నిర్మాణ సంస్థ కానీ.. దర్శకుడు, హీరో కానీ.. ఎలాంటి క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఓటీటీ పార్టనర్ జీ5 కూడా నో కామెంట్స్ అంటూ తప్పించుకుంటూ వచ్చింది.

ఇప్పుడు ఎలాంటి హడావుడి లేకుండా.. ఎలాంటి నోటీస్ లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది ‘హనుమాన్‘. ఈరోజు (మార్చి 17) నుంచి జీ5 వేదికగా ‘హనుమాన్‘ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుంది. శనివారం రాత్రి నుంచి జియో సినిమా లో హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మొత్తంమీద.. విడుదలైన 66 రోజులకు ‘హనుమాన్‘ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చిందన్నమాట. మరి.. సిల్వర్ స్క్రీన్ పై సరికొత్త కలెక్షన్ల రికార్డులు కొల్లగొట్టిన ‘హనుమాన్‘ ఓటీటీలో వ్యూస్ పరంగా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Related Posts