‘కార్తికేయ 3‘ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చిన నిఖిల్

వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ టాలీవుడ్‌ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో నిఖిల్. ఈ యంగ్ హీరో కెరీర్ లో ‘కార్తికేయ‘ సిరీస్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ సిరీస్ లో ఫస్ట్ పార్ట్ తెలుగుకే పరిమితమైతే.. రెండో భాగం ‘కార్తికేయ 2‘ పాన్ ఇండియా లెవెల్ లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. చందూ మొండేటి దర్శకత్వంలో అభిషేక్ అగర్వాల్ నిర్మించిన ‘కార్తికేయ 2‘.. ద్వారక బ్యాక్ డ్రాప్ లో మిస్టికల్ అడ్వెంచర్ గా ఆడియన్స్ ముందుకొచ్చి అఖండ విజయాన్ని సాధించింది.

‘కార్తికేయ 2‘కి మరో సీక్వెల్ ఉంటుందని అప్పుడే హింటిచ్చారు మేకర్స్. ప్రస్తుతం ‘కార్తికేయ 3‘కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తవుతున్నాయట. ‘సరికొత్త అడ్వెంచర్‌ ను సెర్చ్‌ చేసే పనిలో డాక్టర్‌ కార్తికేయ నిమగ్నమయ్యాడు. త్వరలో రానున్నాం’ అంటూ నిఖిల్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అలాగే.. తన పోస్టుకి రెండు ఫోటోలను కూడా జత చేశాడు.

ప్రస్తుతం హీరో నిఖిల్ ‘స్వయంభూ‘ చిత్రంతో బిజీగా ఉంటే.. డైరెక్టర్ చందూ మొండేటి ‘తండేల్‘ సినిమాతో ఉన్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాతే నిఖిల్-చందూ మొండేటి కలయికలో ‘కార్తికేయ 3‘ పట్టాలెక్కనుంది. త్వరలోనే.. ‘కార్తికేయ 3‘కి సంబంధించి మరిన్ని ఇంట్రెస్టింగ్ డిటెయిల్స్ చెప్పనున్నార

Related Posts